Monday, December 23, 2024

Sai Pallavi New Movie : తెలుగులో కొత్త సినిమాకు సైన్‌ చేసిన సాయిపల్లవి

లేడీ పవర్‌స్టార్‌ సాయిపల్లవికి తెలుగులో ఫాలోయింగ్‌ మాములుగా ఉండదు. టాలివుడ్‌ హీరోయిన్స్‌లో ఎక్కువ ఫ్యాన్‌ బెస్‌ ఉన్న నటి సాయిపల్లవి. శ్యామ్‌ సింగ్‌ రాయ్‌ సినిమా తర్వాత తెలుగులో గ్యాప్‌ ఇచ్చిన పల్లవి.. ఇప్పుడు టాలివుడ్‌లో కొత్త సినిమాకు సైన్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తనే ట్విట్టర్‌ వేదికగా ప్రేక్షకులకు తెలియజేశారు.
పాన్ ఇండియా మూవీగా
చాలా గ్యాప్‌ తర్వాత తెలుగు ప్రేక్షకుల మందుకు రావడం చాలా సంతోషంగా ఉందని నటి సాయిపల్లవి తెలిపింది. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా..! NC23 పేరుతో యువ సామ్రాట్‌ నాగ చైతన్య సరసన సాయి పల్లవి ఈ సినిమాలో నటించనున్నారు. ఇది పాన్‌ ఇండియా మూవీ. ఈ సినిమాకు దర్శకత్వం చందూ మొండేటి వహించగా, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గీతా ఆర్ట్స్ తో సాయి పల్లవి
గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. NC23 ప్రీ ప్రొడెక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో గ్రాండ్‌గా ఈ సినిమాని నిర్మించబోతున్నారని సమాచారం. అయితే కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులకే నిర్మాతలు భారీ బడ్జెట్‌ను పెడుతున్నట్లు టాక్.
ఇప్పటికే హిట్ సినిమా
మత్స్యకారుల జీవితానికి సంబంధించిన కథగా వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో తనూ ఒక భాగం అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని సాయిపల్లవి తెలిపారు. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరి’ లో ఎంత పెద్ద హిట్‌ ఇచ్చిందో మనకు తెలుసు. ఈ సినిమాలో కూడా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు.
NC23 సినిమాలో సాయిపల్లవి నటించనుందనే వార్త సోషల్‌ మీడియాలో ఎప్పటి నుంచో వైరల్‌ అవుతుంది. మొత్తానికి అఫీషియల్‌గా ఇప్పుడు బయటకు రావడంతో తెలుగు ప్రేక్షకులు ఫుల్‌ కుష్‌ అవుతున్నారు. సాయిపల్లవి అంటే కేవలం సినిమా లైఫ్‌లోనే కాకుండా నిజ జీవితంలో కూడా తెలుగు తనం ఉట్టిపడేలా ఆమె మాట, నడవడిక ఉంటుందని అందరూ అభిమానిస్తారు.
హిట్ కోసం చైతు
ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. ఈ మధ్యనే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ మూవీలో హీరోగా నటించిన చైతుకు ఆ చిత్రం పెద్దగా సక్సస్‌ ఇవ్వలేదు. ఇప్పుడు భారీ బడ్జెట్‌తో వస్తున్న NC23పై చైతన్య గట్టిగానే హోప్స్‌ పెట్టుకున్నాడట. చూడాలి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత మేర అలరిస్తుందో.
దర్శకుడిపై భారీ అంచనాలు
ఇక దర్శకుడు చందూ మెుండేటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తీకేయ 2 సినిమాను ఎంత బాగా తెరకెక్కించాడో అందరూ చూశారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసును షేక్ చేసింది. పాన్ ఇండియా సినిమాగా హిట్ కొట్టింది. కార్తికేయ 2 చిత్రంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించారు.
పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టి.. అందరినీ ఆశ్చర్యపరించింది. నార్త్ ప్రేక్షకులు కార్తికేయ 2కు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు చందూ మెుండేటి.. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతకుముందు లవ్ స్టోరీ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఆ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.

Related Articles

Latest Articles