Maayon Movie Review In Telugu : ఓటీటీల్లో కొత్త కంటెంట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కుమారుడి సినిమా ఓటీటీలోకి వచ్చింది. శిబి సత్యరాజ్ నటించిన మాయోన్ సినిమా థ్రిల్లర్ లవర్స్ ను మెప్పిస్తుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. పురాతన టెంపుల్ గుడి మిస్టరీ బ్యాక్ డ్రాప్‍తో సినిమాను తెరకెక్కించాడు ఎన్ కిశోర్. తాన్య రవిచంద్రన్, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?
కథ ఏంటంటే..
ఆర్కియాలజీ శాఖలో ఉద్యోగుల వరుసగా హత్యలకు గురవుతారు. ఈ విషయం రాష్ట్రా వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఇదంతా చేసేది ఎవరో కాదు.. అందులో పనిచేసే సీనియర్ ఆఫీసరే చేస్తుంటాడు. పురాతన విగ్రహాలను వెలికితీసిన అధికారులను చంపేసి దేవరాజ్(హరీశ్ పేరడి) ఈ పని చేస్తాడు. అతడికి అర్జున్(శిబి చక్రవర్తి) సాయం చేస్తాడు. ఓ గ్రామంలో పురాతన కృష్ణుడి ఆలయం ఉంటుంది. అందులోని రహస్య గదిలో వందల కోట్ల రూపాయల నిధి ఉందని దేవరాజ్ తెలుసుకుంటాడు.
ఇక అర్జున్ సాయంతో నిధిని దొంగిలించాలని ప్లాన్ గీస్తాడు. అయితే ఇక్కడ మాత్రం ఓ ఇంట్రస్టింగ్ విషయం జరుగుతుంది. సాయంత్ర 6 గంటల తర్వాత గుడిలో అడుగుపెట్టినవారు మతిస్థిమిత కోల్పోతారు. గుడి గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ విషయాలను పట్టించుకోని అర్జున్.. గుడిని తెరిచేందుకు తన టీమ్ తో కలిసి వెళ్తాడు. గుడిలో నిధి ఉందా? అర్జున్ టీమ్ ప్రాణాలతో ఉందా? అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటి? నిధి దొరికాక దేవ రాజ్ ఏం చేశాడు? అని తెలియాలంటే.. మాయోన్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కేరళ అనంతపద్మనాభస్వామి ఆలయం గురించి తెలుసు కాద. కాస్త ఆ స్టోరీలాగానే అనిపిస్తుంది. అక్కడ ఆరో గదిలో చాలా నిధి ఉందని ప్రచారం ఉంది. అది ఇప్పటికి తెరవలేదు. తెరిస్తే ప్రళయమే అని కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అందులో మాత్రం వేల కోట్ల సంపద ఉన్నట్టుగా కూడా చెబుతారు. ఈ పాయింట్ తీసుకున్నాడు దర్శకుడు. ఆ కథనాల స్ఫూర్తితో మాయోన్ సినిమాను తీశాడు.
దేవుడు, సైన్స్ రెండు ముఖ్యమే అని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కిషోర్. ఈ సినిమా ఆసక్తిగా సాగుతుంది. విగ్రహాలను విదేశాలకు అమ్ముకుని డబ్బులు సంపాదించడం ముఠాల గురించి టచ్ చేశాడు దర్శకుడు. కథను అలా లింక్ చేయడం బాగుంది. హీరో క్యారెక్టర్ మీద ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అయితే అది కాస్త అర్థమైపోతుంది. నటీనటులు పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
కొన్ని సన్నివేశాల్లో సీన్లు సిల్లీగా అనిపిస్తాయి. దర్శకుడు కొన్ని చోట్ల లాజిగ్ మిస్ అయ్యాడు అనిపిస్తుంది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ పాటలు మాత్రం పెద్దగా ఎక్కవు. కథలోకి రెండు పాటలను చొప్పించినట్టుగా ఉంటుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకుడు కన్విన్స్ అవ్వడు. శిబి సత్యరాజ్ నటన ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకసారి సినిమా చూడొచ్చు.