Monday, December 23, 2024

Allu Arjun : అల్లు అర్జున్‍తో అట్లీ సినిమా.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధేనా?

Allu Arjun and Atlee : రాజా రాణి సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అట్లీ. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో దుమ్మురేపుతున్నాడు అల్లు అర్జున్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు షూటింగ్ జోరుగా సాగుతుంది. ఇలాంటి సమయంలో బన్నీ ముంబయి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అట్లీతో సినిమా కోసమే ముంబయిలో భేటీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. జవాన్ సినిమాతో అట్లీ మంచి విజయం సాధించాడు.

అంతకుముందు అతడి దర్శకత్వంలో వచ్చిన రాజా రాణి సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు.
తాజాగా అల్లు అర్జున్-అట్లీ మీట్ కావడంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జవాన్ సినిమా గురించి అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించినట్టుగా తెలుస్తోంది. అట్లీ దర్శకత్వ ప్రతిభను బన్నీ బాగా మెచ్చుకున్నాడట. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొత్త సినిమా చేయాలనే అంశం గురించి మాటలు వచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్త సినిమా చేయాలనే విషయంపై ఇద్దరూ చర్చించుకున్నారట.

కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ జవాన్ సినిమా చూశాడు. అట్లీని మెచ్చుకున్నాడు. తర్వాత ముంబయి వెళ్లి అట్లీని కలవడంపై చర్చ నడుస్తోంది. కేవలం అట్లీని కలిసేందుకు ముంబై వెళ్లాడట అల్లు అర్జున్. ప్రస్తుతానికి పుష్ప 2 షూటింగ్ నడుస్తోంది. సినిమా ప్రమోషన్ కు సంబంధించిన ఎలాంటి పనులు మెుదలుకాలేదు. దీంతో ముంబయికి ఎందుకు వెళ్లాడనే ప్రశ్న అందరికీ వస్తోంది.

అయితే అట్లీ ముంబయిలో కొన్ని రోజులు ఉంటున్నాడు. ఎందుకంటే.. జవాన్ సక్సెస్ తర్వాత అక్కడే ఉంటూ.. ప్రమోషన్ వర్క్స్ చూసుకుంటున్నాడు. షారూఖ్ ఖాన్ తోపాటుగా అట్లీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అందుకే ముంబయిలో ఉంటున్నాడు. కానీ అల్లు అర్జున్ అక్కడకు వెళ్లి.. ప్రత్యేకంగా అట్లీని కలవడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు.
పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. వచ్చే ఏడాదిన సినిమాను విడుదల చేయనున్నారు. జవాన్ సినిమాతో అట్లీ పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే.. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.

అయితే ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఇటీవల అనిరుధ్ మ్యూజిక్ ను అల్లు అర్జున్ ప్రశంసించాడు. దానికి బదులుగా అనిరుధ్ థాంక్స్ అని చెప్పాడు. థాంక్స్ మాత్రమే.. కాదు.. నాకు మంచి మ్యూజిక్ ఇవ్వాలని ట్విట్ చేశాడు బన్నీ. సరే అని అనిరుధ్ కూడా అన్నాడు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టులో అనిరుధ్ కూడా చేరుతాడ అని చర్చ జరుగుతోంది. పుష్ప 2 సినిమా తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. 530 కోట్ల రూపాయలకుపైగానే కొల్లగొట్టింది. షారుఖ్, నయనతార, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో నటించారు. ప్రస్తుతం వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Articles

Latest Articles