Prabhas Nayanthara Kannappa : మంచు విష్ణు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రంలో ప్రభాస్ కూడా నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ప్రభాస్‍తోపాటుగా నయనతార కూడా చిత్రం నటించనుంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ నయనతార కలిసి నటించి 16 ఏళ్లు దాటుతుంది. తాజాగా వీరిద్దరూ మరోసారి జంటగా కనిపించనున్నారు. శివపార్వతుల్లా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మంచు విష్ణు వీరిద్దరినీ ఒప్పించినట్టుగా తెలుస్తోంది.
మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ కన్నప్ప. కృష్ణంరాజు భక్త కన్నప్పగా అలరించిన విషయం తెలిసిందే. అదే కాన్సెప్ట్ తో కన్నప్ప సినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమా గురించి బాగా హైప్ క్రియేట్ అయింది. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్టులో నటించనున్నాడని కన్ఫామ్ అయింది.
మరోవైపు ఈ చిత్రం నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంటున్నట్టుగా న్యూస్ వచ్చింది. వ్యక్తిగత కారణాలతో ఆమె తప్పుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. దీంతో కొంతమంది ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నయనతార నటించనుంది. ఇద్దరూ శివపార్వతుల్లా కనిపించనున్నారని చర్చ నడుస్తోంది. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
కొన్ని రోజుల కిందట ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడని మంచు విష్ణు ట్వీట్టర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ ప్రాజెక్టులో చేరడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కన్నప్ప సినిమాకు మహాభారత టీవీ సీరియల్ ఫేమ్ ముకేషఅ కుమార్ సింగ్ డైరెక్షన్ చేయనున్నాడు. టీవీలో ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది.
ప్రభాస్, నయనతార జంటగా నటించి.. 16 ఏళ్లు అవుతుంది. వివి వినాయక్ దర్శకత్వంలో ప్రభాస్, నయనతార కలిసి నటించారు. కానీ సినిమా అప్పుడు అనుకున్నంత రేంజ్‍లో ఆడలేదు. కానీ పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ జనాలు మోగిస్తూనే ఉంటారు. ఇప్పుడు శివపార్వతుల్లా ఇద్దరూ కెమియో రోల్స్ చేయనున్నారు.
కన్నప్ప సినిమాను మోహన్ బాబు, మంచు విష్ణఉ కలిసి నిర్మిస్తున్నారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్పను స్ఫూర్తిగా తీసుకుని మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‍లోనే ఎక్కువగా ఉంటుందట. ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా దర్శనమిచ్చాడు. ఇప్పుడు శివుడిగా కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి.