Monday, December 23, 2024

Vijay Sethupathi : ఆ హీరోయిన్‍తో రొమాన్స్ చేయనని చెప్పిన విజయ్ సేతుపతి

Vijay Sethupathi On Krithi Shetty : విజయ్ సేతుపతి విలన్‍గా, హీరోగా అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. కొత్త తరహా పాత్రలు చేస్తూ.. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన జవాన్ సినిమాలోనూ విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్శించాడు. అయితే తాజాగా అతడు చేసిన కామెంట్స్ ఆసక్తిగా ఉన్నాయి. ఓ హీరోయిన్‍తో అస్సలు రొమాన్స్ చేయనని చెప్పాడు.

విజయ్ సేతుపతికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్‍లోనూ దూసుకెళ్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జవాన్ సినిమాలో విలన్‌గా నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

బాలీవుడ్ నుంచి కూడా అతనికి ఆఫర్లు వస్తున్నాయి. విజయ్ సేతుపతి తమకంటూ కొన్ని హద్దులు పెట్టుకున్నాడు. అంతకు మించి ఎప్పటికీ వెళ్లరు. ఓ స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయడం తనకు ఇష్టం లేదన్నాడు. దీనికి గల కారణాన్ని కూడా వివరించాడు.

ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టితో రొమాన్స్ చేయలేనని చెప్పాడు విజయ్ సేతుపతి. దీనికి కారణం ఉప్పెన సినిమా. ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి కృతి శెట్టి కూతురి పాత్రలో నటించింది. ఒక నటిని తన కూతురిలా చూసుకుని ఎలా రొమాన్స్ చేయగలనని విజయ్ సేతుపతి ప్రశ్నించాడు. అందుకే కృతితో రొమాన్స్ చేయనని చెప్పాడు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఓ చిత్ర బృందం వచ్చి కృతిని కథానాయికగా ఎంపిక చేస్తామని చెప్పారు. కానీ దీనికి విజయ్ సేతుపతి నో చెప్పాడు. ఆయన నిర్ణయాన్ని పలువురు అభినందించారు. కూతురి క్యారెక్టర్ చేసినందుకు మళ్లీ ఆమెతో రొమాన్స్ చేయనని చెప్పడం విజయ్ సేతుపతి గొప్పతనం అని మాట్లాడుకుంటున్నారు.

ఇక జవాన్ సినిమా విషనికి వస్తే.. సూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 562 కోట్ల రూపాయలను రాబట్టింది. తమిళ దర్శకుడు అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నయనతార కూడా ఇందులో ఉంది. విజయ్ సేతుపతి విలన్ రోల్‍లో ఆకట్టుకున్నాడు.

Related Articles

Latest Articles