Monday, December 23, 2024

Balakrishna : బాలయ్యను రౌడీతో పోల్చిన హీరోయిన్.. ఫ్యాన్స్ పైర్

అసెంబ్లీ సెషన్‌లో బాలకృష్ణ మీసాలు తిప్పుతూ, ఈలలు వేసిన విషయం తెలిసిందే. బాలయ్య చర్యను ఎమ్మెల్యేలు ఖండించారు. సినిమా నటుడిగా, బాధ్యతగల శాసనసభ్యుడిగా అసెంబ్లీ లాంటి చోట ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. అయితే ఈ విషయంపై నటి మాధవి లత కూడా స్పందించింది. బాలయ్య చేసిన పనిపై విమర్శలు గుప్పించింది.

టాలీవుడ్‌లో గత 4 దశాబ్దాలుగా నందమూరి బాలకృష్ణ ఎన్నో హిట్ సినిమాలను అందిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బాలయ్య సినిమా ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా విడుదల అవుతాయి. ప్రతి సినిమా విడుదలైనప్పుడు అక్కడి తెలుగు వారు తమ అభిమాన నటుడి సినిమా చూసి సంబరాలు చేసుకుంటారు.

నందమూరి బాలకృష్ణ సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా అక్కడ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో బాలయ్యది ముఖ్యమైన పాత్ర. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టును కూడా బాలయ్య తీవ్రంగా ఖండించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సెషన్లలో బాలయ్య సీరియస్ అయ్యాడు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. వైఎస్ఆర్ ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి కూడా దిగాడు బాలకృష్ణ.

బాలకృష్ణ మీసాలు తిప్పిన విషయం వైరల్ అయింది. బాలయ్య చర్యను ఎమ్మెల్యేలు ఖండించారు. సినిమా నటుడిగా, బాధ్యతగల శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోమని చెప్పారు. ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ విషయంపై నటి మాధవి లత వ్యాఖ్యానించారు.

బాలకృష్ణ తన సహచరులతో కలిసి అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేసిన మాధవి లత వీళ్లు ఆంధ్రా ప్రజలు ఎన్నుకున్న రౌడీలు అని రాసుకొచ్చంది. మాధవి వ్యాఖ్యలు చూసి బాలయ్య అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. నా సోషల్ మీడియాలో నాకు నచ్చినవి రాస్తాను అంటూ మరో పోస్ట్ షేర్ చేసింది మాధవి లత. మాధవి తీరుపై బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే 109వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. బాబీ కొల్లి (రవీంద్ర) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టులో టీడీపీలోనూ క్రీయాశీలకంగా ఉన్నాడు బాలకృష్ణ.

Related Articles

Latest Articles