Monday, December 23, 2024

OTT Movies : ఓటీటీల్లో సినిమాల జాతర.. ప్రేక్షకులకు రచ్చ రచ్చే

ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వారానికి రెండు మూడు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో చాలా కంటెంట్ ఓటీటీల్లోకి వచ్చింది. ఓ వైపు థియేటర్లలో రిలీజ్‍లు మరోవైపు ఓటీటీల్లో రిలీజ్‍లో ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

స్కంద, చంద్రముఖి 2, పెద్ద కాపు 1 వంటి కొన్ని క్రేజీ చిత్రాలు థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ థియేట్రికల్ విడుదలలతో పాటు, OTT ప్లాట్‌ఫారమ్‌లు ఈ వారం కొన్ని ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‍లు ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ గాండీవవధారి అర్జున, మలయాళ బ్లాక్ బస్టర్ RDX ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించాయి.

నిత్యా మీనన్ వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. విమర్శకుల ప్రశంసలు పొందిన హిందీ వెబ్ సిరీస్ Hostel Daze సెప్టెంబర్ 28న నాల్గో సీజన్‌తో తిరిగి వస్తోంది. హాస్టల్ డేజ్ సీజన్ 4 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. రీసెంట్‌గా ఈ సిరీస్‍ను తెలుగులో కూడా రీమేక్ చేశారు.

అఖిల్ అక్కినేని ఏజెంట్ సెప్టెంబర్ 29న సోనీ LIVలో OTTలోకి రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లిక్ కానప్పటికీ, చాలా మంది ఈ చిత్రాన్ని OTTలో చూడటానికి వేచి ఉన్నారు. చాలా రోజులుగా ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది ఎదురుచూస్తున్నారు. 96 ఫేమ్ గౌరీ కిషన్, జీవీ ప్రకాష్ నటించిన ఆదియే చిత్రం సెప్టెంబర్ 29 నుండి సోనీ LIVలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా గుర్తింపు వచ్చింది.

ఇక తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా కొత్త వెబ్ సిరీస్ పాపం పసివాడుతో వస్తోంది. గాయకుడు శ్రీరామ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 29 నుండి ఆహాలో ప్రసారం కానుంది. దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా సెప్టెంబర్ 28 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇలా మెుత్తానికి సెప్టెంబరులో ఓటీటీల్లోకి పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్‍లు వస్తున్నాయి.

Related Articles

Latest Articles