పుష్ప 1: ది రైజ్ సినిమా దేశంలో పాన్ ఇండియా మూవీస్‌కు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీతో అన్నీ రకాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2021లో ఈ మూవీ వచ్చింది.. అప్పటి నుంచి పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 నుంచి వచ్చిన ఏ చిన్న అప్‌డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అప్పట్లో వచ్చిన అల్లు అర్జున్ లుక్ నుంచి మొన్న వచ్చిన ట్రైలర్ వరకూ అన్నీ సంచలనం సృష్టించాయి. 2024 ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి వస్తుందో కూడా తెలిసింది.
దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే ఈ సీక్వెల్‍నే మరింత భారీగా తీస్తున్నారు. పుష్ప 1 బంపర్ హిట్ కొట్టడంతో.. పుష్ప 2 పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్లను ఏమాత్రం అసంతృప్తి పరచకూడదనే సుకుమార్ సీక్వలెన్ భారీగా తీస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకుందని టాక్.
థియేటర్ రిలీజ్ పూర్తయ్యాక.. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసుకునేందుకు నెట్‍ఫ్లిక్స్ డీల్ కుదుర్చుకుందట. భారీ మొత్తంలోనే సినిమా డిజిటల్ రైట్స్‌ను కైవసం చేసుకుంది. పుష్ప 1 డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ తీసుకుంది. కాగా పుష్ప 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. అయితే కేవలం హిందీ రైట్స్‌ను మాత్రమే నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటుందని, మిగతా భాషాల్లో స్ట్రీమింగ్‌ను అమెజాన్ తీసుకుంటుందని సమాచారం.
ప్రజెంట్ పుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్సులు తీశారు. పుప్ప 1లో గంధపు చెక్కల స్మగ్లింగ్ సిండికేట్ కూలీగా మొదలై.. లీడర్‌గా పుష్పరాజ్ రూల్ చేయడంతో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు పుష్ప 2 ది రూల్‌లో.. అల్లు అర్జున్ రూల్ చేయడం ఈ మూవీలో ఉండనుంది. శేషాషల అడవుల్లోనే సినిమాలో చాలా సీన్స్ తీస్తున్నారు.
వచ్చే జనవరికి షూటింగ్ పూర్తైతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టాట్ అవుతాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ప్రేక్షకులు ఎదురుచూసే.. పుష్ప 2 సినిమా ఆగస్టు 15. 2024లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప1లో హీరోయిన్‌గా ఉన్న రష్మిక మందన్నానే సీక్వేల్లో కూడా ఉంటారు. అయితే ఈ మూవీలో సమంత ఎంట్రీ ఉంటుందని టాక్ నడిచినప్పటికీ.. దీనిపై సమంత క్లారిటీ ఇచ్చింది.