mangalavaram Movie Release Date : ఇప్పటివరకు దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించిన అజయ్ భూపతి మంగళవరం సినిమాతో నిర్మాతగానూ ప్రమోట్ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే సినీవర్గాల్లో అంచనాలు పెరిగిపోయాయి. నవంబర్ 17న ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది.
తెలుగులో ఆర్ఎక్స్ 100 చిత్రం 2018లో విడుదలై సందడి చేసింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ‘మంగళవరం’ చిత్రం కూడా అతడి దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నటి పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాలో బోల్డ్ రోల్ చేసింది . ఇప్పుడు మరోసారి దర్శకుడు అజయ్ భూపతితో చేతులు కలిపి మంగళవరం సినిమాలో కీలక పాత్ర పోషించింది. టీజర్ ద్వారా ఉత్కంఠ రేపిన ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మంగళవరం సినిమా నవంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది .
టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు అజయ్ భూపతి. ‘ఆర్ఎక్స్100’ సినిమాతో పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ‘మంగళవరం’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన టాలెంట్ నిరూపించుకునేందుకు రెడీ అయ్యాడు. స్వాతి గుణపతి, సురేష్ వర్మల ‘ముద్ర మీడియా వర్క్స్’, అజయ్ భూపతి ‘ఎ క్రియేటివ్ వర్క్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇన్నాళ్లు దర్శకుడిగా తన దృష్టిని ఆకర్షించిన అజయ్ భూపతి ‘మంగళవరం’ సినిమాతో నిర్మాతగానూ ప్రమోట్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్శించారు. మంగళవరం నవంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.
మంగళవరం సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు శ్రీతేజ్, అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, లక్ష్మణ్‌తో పాటు పలువురు ఆర్టిస్టులు నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర పని చేశారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సాయికుమార్ యడవల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది యాక్షన్-థ్రిల్లర్ చిత్రం అని తెలుస్తోంది.