Monday, July 1, 2024

Actress Priyamani : షారూఖ్ ఖాన్‍పై మనసు పారేసుకున్న ప్రియమణి.. ఆడేసుకుంటున్న జనం!

Actress Priyamani : నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఢీ లాంటి కార్యక్రమాల్లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల జవాన్ సినిమా నటించింది. సినిమా హిట్ కొట్టడంతో ఈ కన్నడ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది.

జవాన్ సక్సెస్‍తో ఆ చిత్ర బృందం ఫుల్ ఖుషిలో ఉంది. ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా ఈ సినిమాతో బాక్సాఫీసు దగ్గర కోట్లు కొల్లగొట్టాడు. ఈ చిత్రంలో నటి ప్రియమణి కూడా ఓ పాత్ర పోషించింది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సందర్భంగా తన మనసులోని మాటను కూడా చెప్పేసింది.

ప్రియమణి ఓ కొత్త వార్తను వెల్లడించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలో ఒక పాత్రలో కనిపించిన ప్రియమణి ఆ సినిమా సక్సెస్ వేవ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ ‘నాకు షారుఖ్‌ ఖాన్‌పై క్రష్‌ ఉంది. ఇంతకాలం దాచుకున్న ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసింది.’ అని చెప్పుకొచ్చింది.

ఈ విషయం తెలిసిన కొందరు పఠాన్, జవాన్ సక్సెస్ తర్వాత షారుఖ్ ఖాన్ మీద క్రష్ అని చెబుతున్నావని మండిపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం దీని గురించి ఏమీ అనలేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల క్రితం ఇదే తరహాలో నటించాడని అప్పట్లో చెప్పనిది ఇప్పుడు చెప్పడంలో ఆంతర్యం ఏంటని అడుగుతున్నారు. కొంతమంది నటి ప్రియమణిని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

ప్రియమణి వ్యాఖ్యలను పలువురు సమర్థించారు. కొన్ని విషయాలు కొన్ని సమయాల్లో మాత్రమే చెప్పగలమని అంటున్నారు. విజయం తర్వాత షారూఖ్ మీతో సహజంగా మాట్లాడాడని, మీరు ఓపెన్‌గా మాట్లాడి ఈ వాస్తవాన్ని పంచుకున్నారని పొగుడుతున్నారు. అందులో తప్పేముంది? చాలా మందికి వారి యుక్తవయస్సులో కొంతమందిపై క్రష్‌లు ఉంటాయని ప్రియమణిని సమర్థిస్తున్నారు. మీ క్రష్‍ను దాచుకోకుండా బయటి ప్రపంచానికి చెప్పావు.. అది గ్రేట్ అంటున్నారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page