Wednesday, July 3, 2024

Sneha Love Story :ఆ తెలుగు హీరోతో స్నేహ ఎఫైర్.. చివరకు ప్రసన్నతో మ్యారేజ్!

Sneha Love Story In Telugu : సినిమా నటుల మధ్య ప్రేమ, బ్రేకప్ అనేది చాలా కామన్. కొన్ని సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ప్రేమలో పడిన నటులు చాలా మందే ఉన్నారు. తర్నాత పెళ్లి చేసుకుని విడిపోయిన వారు అనేకమంది. ప్రేమించుకుని పరిస్థితులు అనుకూలించక.. దూరమైనవారూ ఉన్నారు. తాజాగా నటి స్నేహ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

నటి స్నేహ తెలుగులో చాలా సినిమాలు చేసింది. అంద, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా, స్నేహ మాత్రం సంతూర్ మమ్మీలానే ఉంటుంది. స్నేహ తన అందాన్ని ఎప్పటికీ కాపాడుకుంటుంది. వయసు పెరిగినా.. కనిపించకుండా మెయింటెన్ చేస్తోంది. కెరీర్ లో స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న స్నేహ.. ఇప్పుడు గృహిణిగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉంది. అయితే స్నేహ మాత్రం నటిస్తూనే ఉంది. తెలుగు, తమిళ సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తోంది.

స్నేహ, ప్రసన్న ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన ప్రముఖ నటుడు కూడా. ప్రసన్నను కలవకముందే స్నేహ మరో నటుడితో ప్రేమలో ఉందని చర్చ నడుస్తోంది. అతడు మరెవరో కాదు తెలుగు నటుడు శ్రీకాంత్ అని తమిళ జర్నలిస్టు, సినీ విమర్శకుడు చెయ్యరు బాలు చెప్పారు. తాజాగా రజనీకాంత్ గురించి మాట్లాడాడు బాలు. ధనుష్, ఐశ్వర్యల విడాకులకు అమలా పాల్ కారణం అని చెప్పుకొచ్చాడు. అమలాపాల్ దంపతుల మధ్యకు వచ్చిందన్న విషయం రజనీకాంత్‌కు తెలుసు అని, అందుకే ఒకసారి అమలాపాల్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చాడని వెల్లడించాడు.

ఇప్పుడు స్నేహ, శ్రీకాంత్ గురించి చెప్పుకొచ్చాడు బాలు. స్నేహ, శ్రీకాంత్‌లు చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇద్దరూ ప్రేమించుకోవ‌డం మొద‌లుపెట్టార‌ని చెప్పారు. అయితే ఈ ఆలోచనను స్నేహ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఖండించారు. శ్రీకాంత్ ది కూడా ప్రేమ వివాహమే. నటి ఊహను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు.

స్నేహ, ప్రసన్నల ప్రేమ చాలా ఏళ్ల నాటిది. ఇద్దరూ ఆలస్యంగా తమ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్, స్నేహ ఎలా ప్రేమలో పడతారు? అని ప్రశ్నించే వాళ్లూ చాలా మందే ఉన్నారు. ఒక నటుడు/నటి కలిసి రెండు సినిమాల్లో నటిస్తే వారిపై గాసిప్‌లు మొదలవుతాయి. అదేవిధంగా స్నేహ, శ్రీకాంత్‌లపై అప్పట్లో గాసిప్‌లు ప్రచారంలోకి వచ్చాయి.

స్నేహ, ప్రసన్న 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ఫిబ్రవరిలో విడుదలైన మలయాళ చిత్రం ‘క్రిస్టోఫర్’లో స్నేహ నటించింది. ఆ తర్వాత ఆమె కొత్త సినిమాను ప్రకటించలేదు. తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్‍గా చేసింది. సెకండ్ ఇన్సింగ్స్ లోనూ మంచి పాత్రలు చేస్తోంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page