Wednesday, July 3, 2024

Indian Movies In Oscars : ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఆస్కార్‍కు ఎన్ని సినిమాలు వెళ్లాయి?

2018 Movie Oscars Entry : 2024 ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా నుంచి మలయాళ మూవీ 2018 ఎంట్రీ సాధించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో సినిమా పోటీ పడనుంది. అయితే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు ఇండియా నుంచి ఆస్కార్‍ కోసం వెళ్లాయి. ఆ వివరాలు చూద్దాం..

సత్యజిత్ రే, భాను అథయా, AR రెహమాన్, రసూల్ పూకుట్టి, గుల్జార్, ఇటీవల MM కీరవాణి, చంద్ర భోస్, కార్తికి గోన్సల్వాస్, గునీత్ మోంగా తదితరులు భారతీయులు ఆస్కార్‌లను గెలుచుకోగలరని చూపించారు. కానీ ఆస్కార్ అనేది చాలా ఏళ్లుగా భారతీయులకు పుల్లని ద్రాక్షలాగానే ఉందనేది నిజం. 1957 నుంచి భారతీయ సినిమాలు ఆస్కార్‌కి వెళ్తున్నాయి. కానీ నిరాశే ఎదురవుతోంది. 2023 వరకు భారతదేశం దాదాపు 56 సినిమాలను ఆస్కార్‌కి పంపింది. ఏ భాషలో ఎన్ని సినిమాలు ఆస్కార్‌కి వచ్చాయి?

ఆస్కార్ 1929లో ప్రారంభమైంది. భారతదేశంలో మొదటి చిత్రం 1913లో నిర్మించారు. కానీ భారతదేశం తన మొదటి సినిమాను 1957లో ఆస్కార్‌కి పంపింది. 44 ఏళ్ల సినిమా నిర్మాణం తర్వాత, భారతదేశం తొలిసారిగా ఆస్కార్‌కి ఒక చిత్రాన్ని పంపింది. అప్పటికి 30 ఆస్కార్ అవార్డు కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఆస్కార్‌కి సినిమాను పంపిన మొదటి సంవత్సరంలోనే, ఆస్కార్ వేదికపై భారతదేశం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా. ఈ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకోలేక పోయినప్పటికీ, ఇది విజయం సాధిస్తుందనే ఆశను పెంచింది. 1957 నుండి, భారతదేశం అధికారికంగా 56 చిత్రాలను ఆస్కార్‌కు పంపింది. వాటిలో చాలా వరకు హిందీ సినిమాలే. ఇప్పటివరకు సరిగ్గా 34 హిందీ భాషా సినిమాలు భారతదేశం నుండి అధికారికంగా ఆస్కార్‌కు పంపించారు.

హిందీతో పాటు తమిళ భాషల సినిమాలను ఎక్కువగా పంపుతున్నారు. ఇప్పటివరకు 10 తమిళ సినిమాలు అధికారికంగా ఆస్కార్‌కి వెళ్లాయి. కానీ ఇప్పటి వరకు ఏ తమిళ సినిమా నామినేట్ కాలేదు. 2018 సినిమాతో ఇప్పటివరకు నాలుగు మలయాళ సినిమాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి.

మరాఠీ భాషలో మూడు సినిమాలు, గుజరాతీ, బెంగాలీ భాషల్లో రెండు సినిమాలు ఇప్పటివరకు ఆస్కార్ పోటీకి వెళ్లాయి. తెలుగు, అస్సామీ భాషల్లో ఒక్కో సినిమా కూడా ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఇప్పటి వరకు ఏ కన్నడ సినిమానూ అధికారికంగా ఆస్కార్‌ పంపలేదు.

ఆస్కార్‌కి పంపిన 56 సినిమాల్లో కేవలం మూడు సినిమాలు మాత్రమే వివిధ కేటగిరీలకు నామినేట్ అయ్యాయి. 1988లో తొలి సినిమా ‘మదర్ ఇండియా’, 2001లో ‘సలాం బాంబే’, ‘లగాన్’ సినిమాలు నామినేట్ చేశారు. గతేడాది అఫీషియల్‌గా పంపిన ‘చెలో షో’ సినిమా షార్ట్‌లిస్ట్‌లో ఉన్నా నామినేషన్‌ దశకు చేరుకోలేకపోయింది. గతేడాది ఉత్తమ ఆర్ఆర్ఆర్‍లోని నాటు నాటు పాట ఆస్కార్‌ను గెలుచుకున్నా.. అధికారిక పంపించింది కాదు.
బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే మూడు సినిమాలు ఆస్కార్‌కు వెళ్లాయి. కమల్ హాసన్ నటించిన ఏడు సినిమాలు ఇప్పటి వరకు ఆస్కార్‌కి పంపించారు. అంతేకాకుండా నటుడు రఘుబీర్ యాదవ్ నటించిన ఏడు చిత్రాలు కూడా ఆస్కార్‌కు వెళ్లాయి. అమీర్ ఖాన్ నటించిన రెండు సినిమాలు, అమీర్ ఖాన్ నిర్మించిన రెండు సినిమాలు ఆస్కార్ బరిలోకి వెళ్లాయి.

మలయాళ చిత్రం ‘2018’ సినిమా 2024 ఆస్కార్‌కు భారతదేశం నుండి ఎంపికైంది. లాస్ట్ టైమ్ ‘RRR’ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్‌ను గెలుచుకుంది. మరి ఈసారి ‘2018’ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో అవార్డ్ సాధిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాకు ఆస్కార్ రావాలని భారతీయులు కూడా కోరుకుంటున్నారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page