Wednesday, July 3, 2024

Modi Movie : హాలీవుడ్‍లో మోడీ సినిమా.. డైరెక్టర్ జానీ డెప్.. ఇది ఎవరి జీవిత కథ?

ది బ్రేవ్‌ తర్వాత జానీ డెప్‌ ఏ సినిమాకు యాక్షన్‌ కట్‌ చెప్పలేదు. ఇప్పుడు మళ్లీ దర్శకత్వం చేయాలనే తపనతో ఉన్నాడు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకుడిగా కుర్చీలో కూర్చుని మోడీ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు.
హాలీవుడ్‌లో మోడీ అనే పేరుపై సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

విశేషమేమిటంటే.. ప్రముఖ నటుడు జానీ డెప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నటుడు అల్ పాసినో ఓ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ తోనే విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. చెప్పాలంటే ఇది బయోపిక్. అలా అని మన ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ కాదు.. ఇంతకీ ఇది ఎవరి జీవిత కథ?

‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ నటుడు జానీ డెప్ చాలా ఏళ్లుగా హాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. డైరెక్షన్‌పై కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. 1997లో ‘ది బ్రేవ్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది అతని మొదటి దర్శకత్వ ప్రయత్నం. ఆ
తర్వాత మళ్లీ ఏ సినిమాకు యాక్షన్‌ కట్‌ చెప్పలేదు. ఇప్పుడు జానీ డెప్ మళ్లీ దర్శకత్వం వహించడానికి ఉత్సాహంగా ఉన్నాడు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకుడి కుర్చీలో కూర్చుని మోడీ సినిమా షూటింగ్ షురూ చేశాడు.

20వ శతాబ్దపు తొలినాళ్లలో ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ పెయింటర్ అమెడియో మోడీగ్లియాని జీవితం ఆధారంగా మోడీ సినిమా రూపొందుతోంది. మోడిగ్లియాని ఆధునిక శైలి చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ ఆ రోజుల్లో ఆ కళాఖండాలకు సరైన గుర్తింపు రాలేదు. ఆయన మరణానంతరం ఆ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. 35 ఏళ్ల వయసులో మరణించిన మోడిగ్లియాని జీవితంలోని సంఘటనలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకుని మోడీ సినిమా తీస్తున్నారు.

ఇటాలియన్ నటుడు రికార్డో స్కామార్చో మోడీ చిత్రంలో అమెడియో మోడీగ్లియాని పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హాలీవుడ్ లెజెండరీ నటుడు అల్ పాసినో కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఇన్ని కారణాల వల్ల మోడీ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Related Articles

Latest Articles

You cannot copy content of this page