Monday, July 1, 2024

This Week Movies : ఈ వారం థియేటర్లలో రిలీజ్‌ అవుతున్న తెలుగు సినిమాలు ఇవే

ప్రతీ శుక్రవారం సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అవుతుంటాయి. గత వారంతో పోల్చుకుంటే.. ఈ వారం విడుదలయ్యే సినిమా లిస్ట్‌ ఎక్కువే ఉంది. అందులో కొన్ని రొమాంటిక్‌ లవ్‌ స్టోరీస్‌ అయితే మరికొన్ని కామెడీవి కూడా ఉన్నాయి. పెద్ద సినిమాలు అన్నీ దసరాకు రిలీజ్‌ అవడంతో.. ఈ వారం చిన్న సినిమాలదే సందడి. కిరణ్‌ అబ్బవరం నటించిన రూల్స్‌ రంజన్‌ సినిమా కూడా అక్టోబర్‌ 6న విడుదల కానుంది. థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాల లిస్ట్‌ చూద్దామా..!

ఎన్నో వాయిదాల తర్వాత చివరకి ‘రూల్స్‌ రంజన్’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసింది. రతన్‌ కృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా ఈ సినిమాలో నటించారు. లవ్‌, కామెడీ జోనర్‌లో ఈ మూవీ ఉండనుంది. ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి తన కాలేజ్‌లో అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత తన లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయి, అప్పటి వరకూ తను పెట్టుకున్న రూల్స్‌ అని పోయి.. మనోరంజన్‌గా ఎలా మారతాడు అనేది కథ. ఫుల్‌ కామెడిగా, పంచ్‌ డైలాగ్స్‌తో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండనుంది.

హర్షవర్దన్‌ దర్శకత్వంలో సుధీర్‌ బాబు నటింటిన ‘మామ మశ్చీంద్ర’ సినిమా కూడా ఈ వారమే విడుదల కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్‌ అవుతుంది. ఇది కూడా రొమాంటిక్‌ కామెడీ మూవీ. ఇందులో సుధీర్‌ బాబు డ్యూయల్‌ రోల్‌ ప్లే చేశారు. హీరోయిన్‌గా ఈషా రెబ్బా నటించింది.

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలంటే.. మ్యాడ్‌ మూవీ చూడొచ్చు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యాడ్‌ చిత్రం కూడా అక్టోబర్‌ 6 నే విడుదల కానుంది. ఇంజినీరింగ్ కాలేజీలో స్నేహితులుగా మారిన ముగ్గురు యువకుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల లైఫ్‌స్టైల్‌, వారు చేసే ఫన్‌, ఎమోషన్స్‌ ఇలాంటివి ఎన్నో ఈ సినిమాలో ఉంటాయి. యూత్‌కు బాగా కనెక్ట్‌ అవుతుంది.

సిద్ధార్థ్‌, నిమిషా సజయన్ జంట‌గా నటించిన ‘చిన్నా’ సినిమా కూడా అక్టోబర్‌ 6 నే విడుదల కానుంది. రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. అరుణ్ కుమార్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. బాబాయికి, చిన్నారికి మధ్య జరిగే కథే చిన్నా సినిమా. కూతురు కిడ్నాప్‌ అయితే సిద్దార్థ్‌ చేసే పోరాటం చుట్టూనే సినిమా తిరుగుతుంది. కిడ్నాప్‌ ఎవరు చేశారు, ఎందుకు చేశారు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.. సినిమా మొత్తం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. తమిళ్‌, మలయాళం, కన్నడలో ఈ మూవీ రిలీజ్‌ అయింది. అక్కడ మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌నే దక్కించుకుంది.

ఈ సినిమాలు కూడా…

మంత్‌ ఆఫ్‌ మధు
తంతిరం
సగిలేటి కథ
ఏందిరా యీ పంచాయితీ
800

ఇవన్నీ చిన్న సినిమాలే అయినా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఇప్పుడు పెద్ద సినిమాల కంటే.. చిన్న సినిమాల సందడే ఎక్కువగా ఉంది. రెండు మూడేళ్లు తీసిన సినిమా కూడా థియేటర్లలో నాలుగు వారాలు కూడా ఆడటం లేదు. చిన్న సినిమాలకు అటు బడ్జెట్‌ తక్కువ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఓటీటీలో కూడా వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Related Articles

Latest Articles

You cannot copy content of this page