Wednesday, July 3, 2024

Michael Jackson Hat : ఇదేందయ్యా ఇది.. 68 లక్షలకు అమ్ముడుపోయిన మైఖేల్ జాక్సన్ టోపీ

Michael Jackson Hat Sold : ప్యారిస్‌లో మైఖేల్ జాక్సన్ టోపీని వేలానికి ఉంచారు. అయితే దీనికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అసలు ఎవరూ ఊహించని విధంగా ఈ టోపీని వేలంలో కొనుగోలు చేశారు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. కేవలం టోపీకి ఇంత ధర ఏంట్రా బాబు అనుకుంటున్నారు.

నిజానికి సెలబ్రిటీలు ఉపయోగించే వస్తువులు ఖరీదైనవి. వేలానికి పెట్టినా ఎంత మొత్తానికైనా కొనేందుకు అభిమానులు ముందుకు వస్తారు. ఇప్పుడు గ్రేట్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ ధరించిన టోపీ భారీ మొత్తానికి అమ్ముడుపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ కొనుగోలు ధర విని చాలా మంది వామ్మో అని నోరు తెరుస్తున్నారు.

మైఖేల్ జాక్సన్ సూపర్‍గా మూన్ వాక్ చేసేవాడు. అది ఇప్పటికి జనాలు ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాదు ఆయన ధరించిన టోపీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 26న ప్యారిస్‌లో మైఖేల్ జాక్సన్ టోపీని వేలానికి ఉంచారు. ఈ టోపీని 68 లక్షల రూపాయలకు వేలం వేశారు. ఈ మొత్తం విని చాలా మంది షాక్ అవుతున్నారు.

మైఖేల్ జాక్సన్ మూన్ వాకింగ్, డ్యాన్స్ చేసేటప్పుడు టోపీని ముఖానికి అడ్డంగా పెట్టుకునేవాడు. దీని కారణంగా టోపీ చాలా వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు అది 68 లక్షల రూపాయలకు వేలంలో కొనుగోలు చేయడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మైఖేల్ జాక్సన్ గిటార్‌ని గతేడాది వేలానికి పెట్టారు. ఈ గిటార్ మూడు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

మైఖేల్ జాక్సన్ ఆగస్టు 29, 1958న అమెరికాలో జన్మించాడు. అతను 50 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఎన్నో వివాదాలు కూడా సృష్టించాడు. తన ముఖానికి చాలాసార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని కూడా చెబుతున్నారు. అతను వందేళ్ల కంటే ఎక్కువగా బతికేందుకు ప్రయత్నించాడు. శరీరంలో ఏదైనా ఫేయిల్ అయితే అవయవ మార్పిడి కోసం.. దాతలను కూడా పెట్టుకున్నాడు. కానీ విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా.. 50 ఏళ్లకే చనిపోయాడు. కానీ ప్రపంచంపై తనదైన ముద్ర వేసాడు మైఖేల్ జాక్సన్.

Related Articles

Latest Articles

You cannot copy content of this page