Wednesday, July 3, 2024

Pooja Hegde : స్టార్ క్రికెటర్‍ను పెళ్లి చేసుకోబోతున్న పూజా హెగ్డే.. ఇంతకీ ఎవరు అతడు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. మంగళూరుకు చెందిన ఈ బుట్టు బొమ్మ టాలీవుడ్, బాలీవుడ్‌లో బిజీగా ఉంది. హైదరాబాద్ ఆమెకు రెండో ఇల్లు లాంటిది. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్, నార్త్ స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేస్తోంది.

తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించిన పూజా గత ఏడాది కాలంగా బాలీవుడ్ లో మెరుస్తోంది. అనేక హిట్ చిత్రాలను అందించినప్పటికీ, పూజా హెగ్డేకి సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. పూజ నటించిన కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. రాధే శ్యామ్, ఆచార్యలాంటి సినిమాలు అనుకున్నంత సక్సెక్ కాకపోవడంతో పూజాను ఐరన్ లెక్ అంటూ ట్రోల్ చేశారు.

సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లోనూ పూజా హెగ్డే మెరిసింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. పూజా హెగ్డేకి కూడా ఈ సినిమా బూస్ట్ ఇవ్వలేదు. ప్రస్తుతం పూజకు మంచి హిట్ కావాలి.

ఇక ఆమె పెళ్లి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. సినీ పరిశ్రమలో ఇప్పుడు పెళ్లిళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా పూజా హెగ్డే పెళ్లి విషయం కూడా చర్చనీయాంశమైంది. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు మొదలయ్యాయి. ఆమె కాబోయే భర్త ముంబైకి చెందిన ప్రముఖ క్రికెటర్ అని అంటున్నారు.

సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా వార్తలు వస్తున్నాయి. క్రికెటర్‌ని పెళ్లి చేసుకోబోతోందని మాట్లాడుకుంటున్నారు. అయితే పూజా మాత్రం దీనిపై మౌనంగానే ఉంది. పెళ్లి వార్తలను ఎప్పుడూ ఖండించలేదు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది కూడా చెప్పలేదు. పూజా పెళ్లి చేసుకోబోయే.. స్టార్ క్రికెటర్ ఎవరా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం పూజా అందమైన లెహంగా, చీరలు ధరించి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. పెళ్లి కూతురిలా మెరిసింది. పెళ్లికి ఎలా సిద్ధం కావాలో చూపించినట్టుగా ఉంది. ఇప్పటికే క్రికెటర్‍తో పెళ్లి విషయం చర్చనీయాంశమైంది.
గతంలో ఒక కార్యక్రమంలో పూజా తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోని అని చెప్పింది. పూజా స్వయంగా క్రికెట్ ప్రేమికురాలు. అందుకే ఇప్పుడు పెళ్లిచేసుకోబోయే క్రికెటర్ ఎవరు అని ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page