Saturday, June 29, 2024

Rajinikanth-Amitabh Movie : రజనీకాంత్ 170వ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌.. 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా

కోలీవుడ్‌లో రజనీకాంత్‌, బాలివుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ సినీ ఇండస్ట్రీలో దిగ్గజాలు. వారి నటనతో ఈ జనరేషన్‌ వారిని కూడా మెప్పించారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి 1991లో ‘హమ్‌’ అనే సినిమాలో నటించారు. దాదాపు 32 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారు. తలైవర్ 170 అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.

అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల్లో మెరుస్తుంటే, తమిళ చిత్రసీమలో రజనీకాంత్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఈ లెజెండరీ ఆర్టిస్టులు ‘తలైవర్ 170’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది రజనీకాంత్ 170వ సినిమా కాగా టైటిల్‌ను తాత్కాలికంగా ‘తలైవర్ 170’ అని పెట్టారు. టైటిల్‌ మార్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి నటించిన సినిమాలు ఇవే..

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన చిత్రం ‘హమ్’. ఆ సినిమా 1991లో విడుదలైంది. ‘హమ్’ కాకుండా 1983లో విడుదలైన ‘అందా కానూన్’ సినిమాలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే 1985లో విడుదలైన ‘జిరఫ్తార్‌’ చిత్రంలో కలిసి నటించారు. ఇప్పుడు రజనీకాంత్ నటించిన తలైవర్ 170 చిత్ర బృందానికి అమితాబ్ బచ్చన్ స్వాగతం పలికారు. ఈ హై-వోల్టేజ్ కాంబినేషన్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి

ఈ ఏడాది రిలీజ్‌ అయిన ‘జైలర్’ సినిమాతో రజనీకాంత్ భారీ విజయాన్ని అందుకున్నారు. ‘తలైవర్ 170’ సినిమాలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ నటించనున్నారు. మరి ఈ సినిమాలో కూడా ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో మెరుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి, నటీమణులు రితికా సింగ్, దుషారా విజయన్ కూడా తలైవర్ 170 లో ఉండటంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు నుంచే సినిమా షూటింగ్‌ కేరళలో ప్రారంభమైంది. కేరళలలో రజినీకాంత్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page