Monday, July 1, 2024

Ram Charan New Movie : స్టార్ హీరోయిన్ కుమార్తెతో రామ్ చరణ్‍ రొమాన్స్.. బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్

Ram Charan New Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికైతే సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. ఓ అప్డేట్ వచ్చింది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురితో రామ్ చరణ్ రొమాన్స్ చేయనున్నాడు.

నటి రవీనా టాండన్ బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాలలో నటించింది. ‘కెజిఎఫ్ 2’లో ఆమె రమిక సేన్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ద్వారా మరింత పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ఆమె కూతురు రాషా థడానీ కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం . రామ్ చరణ్ తదుపరి సినిమాలో రాషా నటించబోతోంది. ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రాషా హీరోయిన్ గా కనిపిస్తుందా? లేదా? అనే ప్రశ్నలు వస్తు్న్నాయి.

రవీనా 1991లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది. ఆమె భర్త అనిల్ తడానీ బాలీవుడ్‌లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు ఆమె కూతురికి 18 ఏళ్లు. దీంతో తమ కుమార్తెను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ సినిమా ద్వారా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు రాషా సిద్ధమైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమా చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పాపులారిటీ సంపాదించాడు. ఇప్పుడు కొత్త కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు దాటుతుందని అంటున్నారు. ఇది విన్న అభిమానులు షాక్ అవుతున్నారు.

రవీనా, అనిల్ తడానీ బుచ్చిబాబుని ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాలో నటించినప్పుడు ఆమెకు 17 ఏళ్లు. కానీ బుచ్చిబాబు తన పాత్రను చక్కగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు రాషా కోసం ఓ మంచి క‌థ‌ను సిద్ధం చేశాడు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గతంలో ఈ విషయంపై మాట్లాడింది రవీనా.. ‘తన కూతురు సినిమా అరంగేట్రం గురించి సమాచారం ఇచ్చింది. రాషా తన చదువును పూర్తి చేయాలి. ఆమె సినిమా ఇండస్ట్రీలో హిట్ అవ్వొచ్చు కాకపోవచ్చు. పరిశ్రమలో విజయం సాధించకపోతే, తనకు నచ్చిన పనిని ఎంచుకోవచ్చు. దానికి చదువు కావాలి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page