ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలు ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు. వారి ప్రొడక్షన్‌లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేసి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాలతో పాటు యావరేజ్ టాక్ అందుకున్న సినిమాలు సైతం ఇప్పుడు ప్రేక్షకాదరణ
పొందుతున్నాయి. ఇటీవల రీరిలీజ్ అయిన సినిమా కలెక్షన్లను చూద్దాం..
7/G బృందావన కాలనీ
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘7/G బృందావన కాలనీ’. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ సినిమాను సెప్టెంబర్ 22న రీరిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదల కావడం విశేషం. ఈ సూపర్ హిట్ మూవీని నిర్మాత ఏఎంరత్నం ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా తొలిరోజు 1.05 కలెక్షన్లను రాబట్టింది.
పోకిరి
పూరీజగన్నాథ్ డైరెక్షన్‌లో మహేష్‌బాబు, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన పోకిరి సినిమా 2006 ఏప్రిల్ 28న విడుదలై బక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. రీరిలీజ్ సినిమాల ట్రెండ్‌ను సెట్ చేసిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. 2022 ఆగస్టు 9న మహేశ్‌బాబు జన్మదిన సందర్భంగా రీరిలీజ్ అయింది. తొలిరోజే 1.76 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. గ్రాస్ కలెక్షన్లు రూ.5కోట్ల వరకు రాబట్టింది ఈ సినిమా.
ఆరెంజ్
రాంచరణ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన క్లాసికల్ సినిమా ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. హారిస్ జయరాజ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమాను 2023, మార్చి 25న రీరిలీజ్ చేయగా 1.52కోట్లు వసూలు చేసింది.
బిజినెస్ మాన్
పూరీ జగన్నాథ్, మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా ‘బిజినెస్ మాన్’ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 2012, జనవరి 13న విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.90కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. 2023 ఆగస్టు 9న మహేశ్‌బాబు జన్మదిన సందర్భంగా రీరిలీజ్ చేశారు. తొలిరోజే నైజాంలో 2.5కోట్లు వసూలు చేసిన ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.4.42కోట్లు రాబట్టింది.
ఖుషి
ఎస్.జే. సూర్య డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్, భూమిక నటించిన సినిమా ‘ఖుషి’. ఈ సినిమా 2001, ఏప్రిల్ 27న విడుదలై ఎంతటి విజయన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను 2023, జనవరి 2న రీరిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 4.15కోట్లు వసూలు చేసింది.
బిల్లా
మెహర్ రమేశ్ డైరెక్షన్‌లో 2007, డిసెంబర్ 14న విడుదలైన సినిమా బిల్లా. ప్రభాస్, అనుష్క, నమిత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను 2022 అక్టోబర్ 23న రీ రిలీజ్ చేయగా
తొలిరోజే 1.05కోట్లను కలెక్ట్ చేసింది.
సింహాద్రి
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 2003 జూలై 9న విడుదలై సింహాద్రి సినిమా అప్పట్లో సెన్సేషన్ హిట్ అందుకుంది. భూమిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను 2023, మే 20న ఎన్టీఆర్ బర్డ్ డే సందర్భంగా రీరిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.4.02 కోట్లను వసూలు చేసింది.
జల్సా
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘జల్సా’ ఈ సినిమా 2008 ఏప్రిల్ 2న విడుదలై అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను 2022 సెప్టెంబర్ 1న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 501 స్కీన్‌లలో రీ రిలీజ్ చేశారు. రూ.3.2కోట్లను వసూలు చేసింది ఈ సినిమా.