Monday, December 23, 2024

Sai Pallavi Wedding : సాయి పల్లవికి పెళ్లి చేసిన నెటిజన్స్

Sai Pallavi Wedding : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి సంబంధించిన ఓ ఫోటో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు పెళ్లి అయిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ అసలు విషయం వేరే ఉంది.
సైలెంట్‍గా సాయి పల్లవి పెళ్లి
సాయి పల్లవి సైలెంట్ గా పెళ్లి చేసేసుకుందని సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమెకు పెళ్లి చేసేశారు. కానీ ఇక్కడ అసలు విషయం మాత్రం అది కాదు. అది సినిమా ముహూర్తం సమయంలో తీసిన ఫొటో. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే అంతకుముందు మాత్రం.. విపరీతంగా ట్రోల్ చేశారు. సాయి పల్లవి టేస్ట్ ఏంటి ఇలా ఉందేంటని కామెంట్స్ చేశారు.
ఫొటో వైరల్
సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఓ కొత్త సినిమా చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అయింది. దర్శకుడితో సాయి పల్లవి పూలమాల వేసుకుని నిలబడి ఉన్నది. దీంతో వారిద్దరినీ చూసిన జనాలు.. పెళ్లి చేసుకుందని ఫిక్స్ అయిపోయారు. కావాలనే కొందరు వైరల్ చేశారు. నిజానికి సాయి పల్లవికి పెళ్లి కాలేదు.
శివకార్తికేయన్‍తో సినిమా
తమిళ నటుడు కార్తికేయన్ సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి #SK21 అని పేరు పెట్టారు. సినిమా ముహూర్త కార్యక్రమంలో భాగంగా.. పూజ చేశారు.

అప్పుడు తీసిన ఫోటోనే అది. కానీ జనాలు మాత్రం సాయి పల్లవికి పెళ్లి చేసేశారు. అందరూ పూల మాల వేసుకుని నిలబడి ఉండగా.. సాయి పల్లవి, దర్శకుడు హైలెట్ అయ్యారు. వారిద్దరి ఫొటోను కొందరు కావాలనే క్రాప్ చేసి మరీ వైరల్ చేసేశారు.
తెలుగులోకి రీ ఎంట్రీ
ఇక సాయి పల్లవి పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చాలా మంది కూడా ఈ విషయాన్ని నమ్మేశారు. ఇది సినిమా ముహూర్త సమయంలో తీసిన ఫొటో అని తెలిసి అభిమానులు సంతోషించారు.

సాయి పల్లవికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక సినిమాల్లో నటించింది. విరాటపర్వం, గార్గి సినిమాల తర్వాత తెలుగు తెరపై ఈ నేచురల్ బ్యూటీ కనిపించలేదు. నాగచైతన్యతో ఇప్పుడు ఓ సినిమా చేసేందుకు రెడీ అయింది.

చాలా రోజులుగా సాయి పల్లవి తెలుగు సినిమాల్లో నటించడం లేదు. తర్వాత ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి. బాలీవడ్‍వైపు సాయి పల్లవి అడుగులు పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Related Articles

Latest Articles