Wednesday, July 3, 2024

Vijay Deverakonda : విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల.. రష్మికతోనే రౌడీ రొమాన్స్!

రౌడీ బాయ్ విజయదేవరకొండ ‘ఖుషీ’ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ శ్రీలీలతో కలిసి దర్శకుడు గౌతమ్ తిన్నూరితో VD12 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తుందని మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల విజయ్‌ సినిమా నుంచి తప్పుకోనుందని టాక్ వినిపిస్తోంది.

కాల్షీట్స్‌లో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే శ్రీలీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తాజా సమాచారం. దీంతో ఆమె స్థానంలో రష్మిక ఈ సినిమాలో విజయ్ సరసన నటించనుందని అంతా చర్చించుకుంటున్నారు. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ అందం శ్రీలీల జోరు తెలుగులో మామూలుగా లేదు. టాప్ హీరోలు నటిస్తున్న పలు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటికే రామ్ పోతినేనితో ఆమె నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది.

నవంబర్‌లో మెగా హీరోతో వస్తున్న ‘ఆదికేశవ’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నితిన్‌తో ఎక్స్‌ట్రా అనే సినిమానూ చేస్తోంది ఈ బ్యూటీ. రవితేజతో ‘ధమాకా’ సినిమా ధమాకా హిట్‌ అందుకున్నాక ఈ బ్యూటీ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆ సినిమా తర్వాత ఇప్పటికే పదికి పైగానే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతలా బిజీగా ఉన్న శ్రీలీల గౌతమ్ తిన్నూరి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌లో జాయిన్ కావడంలేదట. దీంతో ఆమె విజయ్‌తో రొమాన్స్‌కు నో చెప్పిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో వైపు ధమాకా హిట్‌తో రవితేజ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. మరోసారి ఈ బ్యూటీతోనే రొమాన్స్‌ చేయాలని మాస్ మహారాజ ట్రై చేస్తున్నాడట. దీనికి శ్రీలీల ఇప్పట్లో డేట్స్‌ అడ్జస్ట్ అవడం కష్టమని చెప్పినట్లు టాక్. అలాగే అల్లు అర్జున్‌ నటిస్తున్న ఓ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు శ్రీలీలకు ఛాన్స్ రాగా ఆ సినిమాకూ శ్రీలీల నో చిప్పినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలతో సినిమా చాన్స్‌లను వదులుకోవడానికి ప్రస్తుతం ఓకే చేసిన ప్రాజెక్టులే కారణం అవుతున్నాయి.

మరోవైపు ఈ బ్యూటీ సినిమాలు చేస్తూనే ఎంబీబీఎస్ చదువుకుంటోంది. వచ్చే డిసెంబర్‌లో పరీక్షలు ఉండడంతో స్టార్ హీరోలతో వస్తున్న అవకాశాలను వదులుకోవల్సి వస్తోందని తెగ ఫీల్ అయిపోతుందట. పరీక్షల కోసం సినిమాలకు ఆమె రెండు నెలలు బ్రేక్ ఇచ్చింది. మరోవైపు ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్‌లు చేస్తుండడంతో తన గ్లామర్‌ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని జాగ్రత్త పడుతోందట. ఈ కారణంగానే విజయ్ దేవరకొండతో సినిమాను చేయలేనని చెప్పిందట. దీనికి మూవీ టీం కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.

ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంతతో ‘ఖుషీ’ సినిమాలో రొమాన్స్‌ చేసి ‘లైగర్’‌ షాక్‌ నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం తన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇస్తూ తన తర్వాత సినిమా అప్‌డేట్స్‌ ఇస్తున్నాడు. విజయ్ కెరియర్‌లో 12వ సినిమాలో శ్రీలీల నో చెప్పడంతో ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మికతో రొమాన్స్‌ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విజయ్, రష్మిక ‘డియర్ కామ్రేడ్’, ‘గీత గోవిందం’ సినిమాల్లో నటించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందని అంతా చర్చించుకుంటున్నారు. అయితే VD12 మూవీ టీం నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప-2 షూటింగ్ లో బిజీగా ఉంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page