Wednesday, July 3, 2024

Pooja Hegde : బుట్ట బొమ్మ‌కు త్రివిక్రమ్ మరో ఛాాన్స్.. అల్లు అర్జున్‍తో సినిమా!

ఒకే హీరోయిన్‌ను పదేపదే రిపీట్ చేస్తే ఎన్నో డౌట్లు వచ్చేస్తాయి. ఆ దర్శకుడికి, హీరోయిన్‌కు ఎఫైర్ అంటూ సోషల్ మీడియాలో లింకులు కలిపేస్తారు. అయితే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన హీరోయిన్స్‌ను రిపీట్ చేస్తూ గాసిప్స్‌ను ఏ మాత్రం పట్టించుకోడు. ఇదివరకు ఇలియానా, సమంత వంటి కథానాయికల‌ను గురూజీ రిపీట్ చేశాడు.

హీరోయిన్ పూజా హెగ్డే‌ను కూడా గురూజీ ఇదివరకు చాలా సినిమాల్లో రిపీట్ చేశాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో వుందంటూ మీమర్స్ అప్పట్లో ఆట ఆడేసుకున్నారు. త్రివిక్రమ్ మరోసారి పూజా హెగ్డే‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. గతంలో సమంతతో అత్తారింటికి దారేది, s/o కృష్ణమూర్తి, అఆ సినిమాలు చేసిన ఈ డైరెక్టర్ ఇలియానా‌తో జల్సా, జులాయి సినిమాలు చేశాడు.

ఇక పూజా హెగ్డే‌తో అరవింద సమేత, అలవైకుంటపురం సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గురూజీ మరో సినిమా తీయలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘ గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

అల్లు అర్జున్ తో AA25 సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమాలో బుట్టబొమ్మను ఆల్రెడీ గురూజీ ఫిక్స్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

మహేష్ బాబు గుంటూరు కారంలో పూజా హెగ్డేతో కొన్ని సీన్స్ చిత్రీకరణ చేశాక డేట్స్ అడ్జెస్ట్ కాక పూజా ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. హిందీలో Kisi Ka Bhai Kisi Ki Jaan సినిమాను చేసింది ఈ అమ్మడు. తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి పూజా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో పూజా హెగ్దేతో మరోసారి త్రివిక్రమ్ సినిమాపై పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

పూజా హెగ్డే మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. రాధేశ్యామ్, కిసికా భాయ్ కిసి కా జాన్ సినిమాలపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది. కానీ అవి అనుకున్నంతగా ఆడలేదు. దీంతో కొన్ని రోజులు ఆమెపై విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. సినిమా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదని తెలుస్తోంది. కొందరు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మాత్రం.. ఆమెకు అవకాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

Latest Articles

You cannot copy content of this page