Monday, July 1, 2024

Vijay Sethupathi : ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి ఎందుకు తప్పుకొన్నాడు?

muttiah muralitharan 800 Movie: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం ‘800’. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. అయితే ఆయన సినిమా నుంచి తప్పుకున్న విషయాన్ని మురళీధరన్ చెప్పాడు.

క్రికెట్ దిగ్గజం ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా వస్తున్న ‘800’ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. మురళీధరన్ ఇండియాలోనూ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. హైదరాబాద్, ముంబయితో పాటు పలు నగరాలకు వెళ్లి ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించాడు. వాస్తవానికి మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. అయితే విజయ్ ఎందుకు సినిమా నుంచి తప్పుకున్నాడు? మురళీధరన్ స్వయంగా వివరించాడు.

దీని గురించి మురళీధరన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ సమయంలో మేం బస చేసిన హోటల్‌లోనే విజయ్ సేతుపతి బస చేశారని మా దర్శకుడు చెప్పాడు. అతన్ని కలుద్దాం, నేను మాట్లాడతాను. సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. క్రికెట్ అంటే ఇష్టం ఉన్న విజయ్ సేతుపతి నాకు అభిమాని కాబట్టి కలవడానికి అంగీకరించాడు. ఐదు రోజుల తర్వాత హోటల్ లోనే సమయం ఫిక్స్ చేశారు. అదేవిధంగా కథ విన్న విజయ్ సేతుపతి చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఇది నేను మిస్ చేయకూడదనుకునే అవకాశమని అతను చెప్పాడు. తర్వాత నిర్మాత కూడా దొరికాడు. సినిమా స్టార్ట్ చేయాలనేది ప్లాన్‌.’ అని మురళీధరన్ గుర్తు చేసుకున్నాడు.

ఈ వార్త తెలియగానే కొందరు రాజకీయ నాయకులు విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రను పోషించడాన్ని వ్యతిరేకించారు. బెదిరించాడు కూడా. సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి కుటుంబంపై కూడా దారుణంగా ట్రోల్ చేశారు. నేను తట్టుకోలేకపోయాను. నా వల్ల విజయ్ సేతుపతి కెరీర్ సమస్య అవుతుందని అనుకున్నాను.’ అని మురళీ చెప్పాడు. తర్వాత నటించడం ఇష్టం లేదని విజయ్‌ చెప్పాడని తెలిపాడు.

ఆ తర్వాత దర్శకుడు మధుర్ మిట్టల్‌ని నా పాత్రకు ఖరారు చేశారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో మధుర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కూడా మధుర్ అద్భుతంగా చేశారు. చాలా కష్టపడి ఆ పాత్రను పోషించాడు.’ అని వెల్లడించాడు.

మురళీధర్ శ్రీలంక తమిళుడు. శ్రీలంక తమిళుల పోరాటానికి మద్దతు ఇవ్వలేదని తమిళులు ఎన్నో ఏళ్లుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే భాషకు, రాజకీయాలకు దూరంగా ఉండే మురళీధరన్ శ్రీలంకలో సొంతంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘800’ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page