Wednesday, July 3, 2024

KGF 3 Update : 2024లో కేజీఎఫ్ 3 షూటింగ్.. విడుదల ఎప్పుడంటే?

హోంబలే ఫిలింస్ తాజాగా సలార్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్ అభిమానులతో పాటు, యష్ అభిమానులకు కూడా శుభవార్త అందించింది. దీంతో రాకింగ్ స్టార్ అభిమానులు థ్రిల్ అయ్యారు. హోంబలే ఫిలింస్ ఇచ్చిన న్యూస్ ఏంటంటే.. కేజీఎఫ్ 3 సినిమా విడుదల తేదీ గురించి..

గతేడాది విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 2 ముగింపులో చిత్ర బృందం మూడో భాగం గురించి హింట్ ఇచ్చింది. దాంతో యష్ తదుపరి సినిమా కేజీఎఫ్ 3 అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు దాని గురించి ఎటువంటి ప్రణాళిక లేదు అని KRG కనెక్ట్స్ కార్తీక్ గౌడ ట్వీట్ చేశాడు. నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ సన్నిహిత వర్గాలు KGF గురించి సమాచారం ఇచ్చాయి.

యష్.. కేజీఎఫ్ 3 సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందింది. యష్ ఇప్పుడు తన 19వ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలో కొత్త సినిమాను ప్రకటిస్తాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. అంటే వచ్చే ఏడాది చివరి నాటికి కేజీఎఫ్ 3లో పాల్గొంటాడు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది అని హోంబలే ఫిల్మ్స్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వార్త తెలియగానే యష్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.

సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని టేకప్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ సినిమా షూటింగ్ ముగుస్తుంది. ఇంతలో యష్ 19వ సినిమా కూడా కంప్లీట్ అవుతుంది.

తర్వాత యష్, ప్రశాంత్ నీల్ మళ్లీ కేజీఎఫ్ 3 సినిమా పనుల్లో బిజీ అవ్వనున్నారు. మొత్తంమీద యష్ అభిమానులు ఈ వార్తతో ఉత్సాహంగా ఉన్నారు. KGF 3 గురించి మరిన్ని అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం యష్ తన 19వ సినిమా చేస్తున్నాడు. ఇటీవల లండన్ వెళ్లి హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫర్‌ని కలిశాడు. తమిళ సినీ విమర్శకుడు మనోబాల విజయ బాలన్ యష్ తదుపరి చిత్రం గురించి అక్టోబర్‌లో ప్రకటన వస్తుందని తెలిపాడు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page