Saturday, June 29, 2024

OMG-2 OTT Release : ఓటీటీలోకి అక్షయ్ కుమార్ OMG-2.. ఎప్పుడంటే

OMG-2 OTT Release Date బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ జెట్‌ స్పీడ్‌లో సినిమాలను తీస్తూ ఉంటారు. అయితే కొంత కాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించడంలేదు. అక్షయ్ తీసిన రామ్ సేతు, బచ్చన్ పాండే, సామ్రాట్ ‌పృథ్వీరాజ్‌తో పాటు మరో ఎనిమిది సినిమాలను ఫటాఫటా విడుదల చేసేశారు. ఈ సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి.

ఈ క్రమంలో ఆయన నటించిన ‘ఓ మై గాడ్-2’ సినిమా ఇటీవల విడుదలై పర్వాలేదు అనిపించింది. మిత్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్ నాఘ్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్‌లో ఆగస్టు 11న అనేక వివాదాల నడుమ ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 8 నుంచి ‘ఓ మై గాడ్-2’ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

పూజా స్టోర్‌ను నడిపే కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) శివ భక్తుడు. భార్య, కొడుకు, తండ్రిని బాగా చూసుకుంటాడు. ఓ రోజు ముగ్దల్ కొడుకు వివేక్‌ చేసిన పనికి స్కూల్ నుంచి బహిష్కరిస్తారు. అతడు టాయ్‌లెట్‌లో తీసిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో పరువు పోయిందని ముగ్దల్.. కుటుంబాన్ని తీసుకుని వేరే ఊరికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్) ప్రత్యక్షమవుతాడు. భయపడకుండా పోరాటం చేయమని ముగ్దల్‌కు చెప్తాడు. దీంతో ముగ్దల్ ఎంచుకున్న మార్గమేంటి? ఆ పరిస్థితి కోర్టు వరకు ఎందుకు వెళ్లింది? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించారు. కొన్ని వ‌ర్గాల వారు దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. అందుకే చివరకు సినిమాలో అక్షయ్‌ పాత్ర పేరును మెసేంజర్‌ ఆఫ్‌ గాడ్‌గా మార్చారు. ఈ సినిమాలో కొన్ని అభ్యంతరమైన సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాకుండా 25 మార్పులు సూచిస్తూ 27వరకు కోతలు విధించారు. దీంతో సెన్సార్ బోర్డు నిర్ణయంపై మూవీ మేకర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఓ మై గాడ్ 2’ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ జారీ చేయడం తనను ఎంతగానో బాధించిందని ఈ చిత్ర దర్శకుడు అమిత్ రాయ్ ఓ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

అయితే ఈ వివాదస్పద సినిమా ఓటీటీలో మాత్రం ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండానే అన్ కట్ వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అక్షయ్ కుమార్ 2012లో నటించిన ‘OMG’ సినిమాకు సీక్వెల్ గా ‘OMG 2’ వచ్చింది. ‘OMG’ ఒక సెటైరికల్ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో అక్షయ్ కృష్ణుడిలా కనిపించి మెప్పించారు. ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్‌గా ‘ఓ మై గాడ్ 2’ను తెరకెక్కించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్ పోషించారు. కొడుకు కోసం పోరాడే తండ్రి పాత్రలో ఆయన నటన అద్భుతమనే చెప్పాలి. హీరోయిన్ యామి గౌతమ్ కూడా లాయర్ పాత్రలో ఆకట్టుకుంది. మొత్తం మీద సెన్సార్ కట్స్ తో థియేటర్స్‌లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న ‘ఓ మై గాడ్ 2’ ఇప్పుడు అన్ కట్ వెర్షన్‌తో ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి మరి.

Related Articles

Latest Articles

You cannot copy content of this page