Monday, July 1, 2024

Boys Hostel OTT Release : OTTలోకి వచ్చేసిన ‘బాయ్స్ హాస్టల్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

కన్నడ సినిమాలు ఈ మధ్య తెలుగులో బాగానే ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలనూ ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలు అయినా కన్నడలో సూపర్ హిట్‌ అయిన సినిమాలను తెలుగులో డబ్ చేసి థియేటర్ రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అలా విడుదల చేసి తెలుగులోనూ హిట్ కొడుతున్నారు.

అలాంటి సినిమాల్లో కన్నడలో సూపర్ హిట్‌ అయి ఆగస్టు 26న తెలుగులో రిలీజ్ అయిన ‘బాయ్స్ హాస్టల్’ సినిమాను ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసి రిలీజ్‌ చేశారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో కన్నడలో ఈ సినిమా ‘హాస్టల్ హుడుగరు బెకగిద్దారే’ పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఒరిజనల్‌ వెర్షన్‌లో రిష‌బ్ శెట్టి, ర‌మ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌లు కనిపించడం విశేషం. దీంతో బాయ్స్‌ హాస్టల్‌ మూవీకి మంచి స్పందన వచ్చింది.

ఈ మూవీ ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. తెలుగులో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్‌ తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను విడుదల చేశాయి. అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు అందించారు. జాతిరత్నాలు సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రల్లో న్నట్లే ఇందులో చాలా పాత్రలు నవ్విస్తాయి.

హాస్టల్ వార్డెన్ ఆత్మహత్య చేసుకోవడం నుంచి మొదలయ్యే ఫన్ బాడీ ఎవరి కంట పడకూడదని వేసే ప్లన్స్ మేధావులుగా కనిపించే సీనియర్ల గ్యాంగ్ సాయం తీసుకోవడం, వారికి మరో ముగ్గరు సూపర్ సీనియర్లు కలవడం వంటి సన్నివేశాల్లో ఈ బాయ్స్‌ అల్లరి మామూలుగా ఉండదు. ఈ సినిమాను చూస్తే హాస్టల్స్‌ ఇలానే ఉంటాయా అనే భయం తల్లిదండ్రుల్లో భయం పుట్టడం ఖాయం.

కథ ఏంటంటే..

హాస్టల్‌లో ఉండే అజిత్‌కు షార్ట్ ఫిల్మ్ కోసం ఓ స్టోరీని రాసుకుంటాడు. ఈ స్టోరీని తన రూమ్‌మెట్స్‌కు చెబుతాడు. అయితే తాను చెప్పిన స్టోరీలాగే నిజంగానే వారి హాస్టల్‌ వార్డెన్ ‌సడెన్‌గా చనిపోతాడు. అతని వద్ద ఒక సూసైడ్‌ లెటర్‌ కూడా లభిస్తుంది అందులో అజిత్‌తో పాటు అతని స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి.

మరి వార్డెన్‌ శవాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్‌ బాయ్స్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో వారికి ఎదురైన అనుభవాలను చక్కటి హాస్యంతో తెరకెక్కించారు. మీరుగనక థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయితే ఓటీటీలో చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

Related Articles

Latest Articles

You cannot copy content of this page