Wednesday, July 3, 2024

OTT విడుదలకు సిద్ధంగా దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త

మలయాళ నటుడు దుల్క‌ర్ స‌ల్మాన్ కొత్త సినిమా ‘కింగ్ ఆఫ్ కొత్త’. 1980లో జరిగే గ్యాంగ్‌స్టర్ కథాంశంతో డైరెక్టర్ అభిలాష్ జోషి తెరకెక్కించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని స్వరపరిచారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిమిష్ రవి, ఎడిటింగ్ శ్యామ్ శశిధరన్ నిర్వహించారు. ముంబై, దుబాయ్ వంటి అత్యంత ఖరీదైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

ఆగస్టు 24న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ అంచ‌నాల‌తో మళయాళం, తెలుగు, తమిళం, తదితర భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ విష‌యాన్ని ఓటీటీ సంస్థ సోమ‌వారం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తూ సెప్టెంబర్ 29నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దుల్క‌ర్ స‌ల్మాన్ జోరు మీద ఉండ‌టంతో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలోనే జ‌రిగింది. సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్‌కు తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దుల్కర్ కథ ఎంపికలో జాగ్రత్త పడితే బాగుండని విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం కానీ ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమాలో పేరులో ఉన్న కొత్త కథలో లేకపోవడమే.

కింగ్ ఆఫ్ కొత్త అన్ని భాష‌ల్లో డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. యాభై కోట్ల‌కుపైగా బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.20 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి దుల్క‌ర్ కెరీర్‌లో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కథ విషయానికి వస్తే ‘కోతా అనే సిటీలో తిరుగులేని రౌడీగా రాజు (దుల్క‌ర్ స‌ల్మాన్‌) చెలామణి అవుతుంటాడు. త‌న స్నేహితుడు క‌న్నాను ఎక్కువ‌గా న‌మ్ముతుంటాడు రాజు. క‌న్నా చేసి మోసం వ‌ల్ల రాజు కోతా టౌన్‌ను వ‌దిలిపెట్టివెళ్లిపోతాడు. తిరిగి రాజు కోతా టౌన్‌లోకి ఎలా వ‌చ్చాడు? సీఐ షాహిల్ (ప్ర‌స‌న్న‌) రాజుకు ఏ విధంగా అండ‌గా నిలిచాడు? రాజును ప్రేమ పేరుతో తార‌(ఐశ్వ‌ర్య ల‌క్ష్మి) ఎందుకు మోసం చేసింది?’ అనేది ఈ మూవీ స్టోరీ.

ఈ సినిమాకు ముందు దుల్కర్ సల్మాన్‌ సాఫ్ట్ లుక్‌లో ఆర్మీ జవాన్‌గా నటించి మెప్పించిన చిత్రం ‘సీతారామం’. అలాంటి ఓ కవితాత్మక చిత్రం తర్వాత దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో దుల్కర్ మాస్ లుక్‌, ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ వల్ల దుల్కర్‌ను ప్రేక్షకులు అంతగా అంగీకరించనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దుల్కర్ నటన, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే చేసినప్పటికీ డైరెక్షన్‌, స్క్రీన్‌ ప్లే లోపాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. అభిలాష్ జోషి డైరెక్ట‌ర్‌గా పరిచయం అయ్యాడు.

ఏది ఏమైనా దుల్కర్ స్టోరీల పరంగా కాస్త జాగ్రత్త తీసుకుంటే పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా IMDbలో 10కి 6.6 రేటింగ్‌లను పొందింది మరియు 60 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. థియేటర్లలో అంతగా ఆడని ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాలంటే సెప్టెంబర్ 29వరకు వేచిచూడాల్సిందే. దుల్కర్ సల్మాన్‌ ప్రస్తుతం వాన్ (తమిళం) అనే తమిళం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ , షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. డైరెక్టర్ రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి డి ధీన దయాళన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీని మూవీ టీం ఇంకా ప్రకటించలేదు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page