Saturday, June 29, 2024

Kushi Trending In India : ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘ఖుషి’ మూవీ.. ఇండియాలోనే రౌడీ హీరో సినిమా ట్రెండింగ్‌

ఖుషి సినిమా థియేటర్లో ఆడకపోయినా.. ఓటీటీలో రెచ్చిపోతుంది. బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. విజయ్‌దేవరకొండ సినిమా అంటే.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. కానీ ఇందులో తమ అభిమాన హీరో అనుకున్నంత రేంజ్‌లో మెప్పించకపోవడంతో.. ఆడియన్స్‌లో నిరాశ మిగిలింది. నెగిటివ్‌ టాక్‌ బాగా రావడంతో.. సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఉండలేదు. కానీ ఓటీటీలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

విజయ్ దేవరకొండ, సమంత క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి మూవీ రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను క్రియేట్‌ చేసింది. ఇక ఆ పాటలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. రిలీజ్‌కు ముందే పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా ఇంక బంపర్‌ హిట్‌ అనుకున్నారు. కానీ సినిమాలో ఊహించినంత లేకపోవడంతో ఫ్యాన్స్‌కు నచ్చలేదు. తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. థియేటర్లో రిలీజైన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చింది.

ఈ మూవీ అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మాత్రం ఈ సినిమాకు రెస్పాన్స్‌ భారీగా వస్తుంది. లాంగ్‌ వీకెండ్‌ రావడంతో తొలి మూడు రోజులు సినిమాను జనాలు బాగా చూశారు. వ్యూవర్‌షిప్‌తో ట్రెండింగ్‌లో నిలించింది. అసలు నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఫ్లాట్‌ఫామ్‌లో అన్నీ బాలివుడ్‌ మూవీలే టాప్‌లో ఉంటాయి. అలాంటిది.. తెలుగు కంటెంట్‌లో ఈ ఖుషి మూవీ టాప్‌లో ఉండటం అంటే నిజంగా పెద్ద విషయమే.

ఇండియాలోనే టాప్‌ ట్రెండింగ్‌ మూవీగా

ఇండియాలోని టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఖుషి టాప్ 1, 2లో ఉండంటంతో చిత్రబృందం సైతం ఆశ్చర్యపోతుంది. తెలుగు వెర్షన్‌లో టాప్‌లో ఉండగా.. హిందీ వెర్షన్‌లో ఈ మూవీ రెండో స్థానంలో ఉంది. ఖుషి తమిళ వెర్షన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఖుషి మూవీ వివిధ భాషల వెర్షన్లో మూడు స్థానాల్లో ఉంది.

నెగిటివ్‌ టాక్‌ రావడంతో ఆగిపోయిన ఆడియన్స్‌…

జనరల్‌గా థియేటర్లో సినిమాకు వెళ్లాలంటే.. మౌత్‌పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఖుషి మూవీ రిలీజ్‌ అయిన రోజే నెగిటివ్‌ టాక్‌ వచ్చేసరికి.. థియేటర్‌కు వెళ్లి చూడాలి అనుకున్న వాళ్లంతా బాలేదని తెలిసి ఎందుకు వెళ్లడం.. ఓటీటీలోకి ఎలాగూ వస్తుందిగా అని ఆగిపోయారు. ఇదే సినిమాకు బాగా మైనస్‌ అయింది. ఎప్పుడైతే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిందో.. జనాలు ఎగబడి చూడటం మొదలుపెట్టారు. అసలు ఎందుకు బాలేదు ఏం బాలేదు అని చూసేవాళ్లు కొందరైతే, విజయదేవరకొండ, సమంత కాంబినేషన్‌ ఎలా ఉంది అని చూసేవాళ్లు ఇంకొందరు. టైమ్‌పాస్‌కు, కొత్త సినిమాగా అని, స్క్రీన్‌ ప్లే ఎలా ఉంది అని ఇలా మొత్తానికి అందరూ ఖుషీ మూవీ మీద పడ్డారు.

ఈ సినిమాకు పాటలే ప్రాణం పోశాయి. ఇంట్రస్టింగ్‌ లైన్‌ తీసుకున్నప్పటికీ దాన్ని ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు శివ నిర్వాణ ఘోరంగా ఫెయిల్‌ అయ్యాడు. ఇక ఇందులో అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్‌ రామకృష్ణలాంటి కమెడీయన్స్‌ ఉన్నప్పటికీ వాళ్లు పెద్దగా మెప్పించలేకపోయారు. మొత్తానికి ఈ మూవీ థియేటర్లలో గెలవకపోయినా ఓటీటీలో గెలుస్తోంది..

Related Articles

Latest Articles

You cannot copy content of this page