Monday, July 1, 2024

OTT Release Movies : ఈ వారం OTTలో విడుదలయ్యే చిత్రాలివే.. ప్రేక్షకులకు పండగే

ఈ వారం థియేటర్, OTTలోకి అదిరిపోయే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు వారాల్లో దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో చాలా సినిమాలు చిత్రీకరణను పూర్తి చేసుకుని బాక్సాఫీస్‌కు క్యూకట్టాయి. పండుగ సందర్భంగా థియేటర్‌లో పెద్ద హీరోల సినిమాలు ఉండడంతో చిన్న సినిమాలన్నీ అక్టోబర్ మొదటి వారంలోనే విడుదల చేసేస్తున్నారు.

ఈవారం థియేటర్, OTTలో విడుదలవుతున్న సినిమాలు చూస్తే అక్టోబర్ 6 శుక్రవారం రోజు ఏకంగా ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవేంటంటే.. సుధీర్‌బాబు నటించిన ‘మామ మశ్చీంద్ర’ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా డిఫరెంట్‌ కన్సెప్ట్‌తో రానున్నట్లు సమాచారం. అదేరోజు కిరణ్ అబ్బవరం నటించిన ‘రూల్స్‌ రంజన్‌’ సినిమా విడుదల కానుంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరాన్ని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు.

అలాగే నవీన్ చంద్ర, కలర్స్‌ స్వాతి నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. ఇందులో భావోద్వేగాలే కీలకంగా చిత్రీకరించినట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తే అర్థమవుతోంది. అదేవిధంగా అక్టోబర్ 6న మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ రానుంది. కల్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘మ్యాడ్’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో సాగే విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

అలాగే శ్రీలంక జట్టు మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ధారంగా రూపొందించిన చిత్రం ‘800’. టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ముత్తయ్య మురళీధరన్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదేవిధంగా సిద్ధార్థ్, నిమిష సజయన్ నటించిన మళయాళ చిత్రం ‘చిత్త’ తెలుగులో ‘చిన్నా’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే మళయాళంలో ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ఎలా ఆడుతుందో చూడాలంటే అక్టోబర్ 6వరకు వేచిచూడాల్సిందే.

OTTలో విడుదలయ్యే చిత్రాలివే..

అక్టోబర్ 5: మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి (నెట్‌ఫ్లిక్స్‌)
అక్టోబర్ 5: ఎవ్రీథింగ్ నౌ (హిందీ), (నెట్‌ఫ్లిక్స్‌)
అక్టోబర్ 5: ఖుఫియా(హిందీ), (నెట్‌ఫ్లిక్స్‌)
అక్టోబర్ 5: లుపిన్ (నెట్‌ఫ్లిక్స్‌)
అక్టోబర్ 4: బెర్హామ్ (నెట్‌ఫ్లిక్స్‌)
అక్టోబర్ 6: ఫెయిర్ ప్లే (నెట్‌ఫ్లిక్స్‌)
అక్టోబర్ 6: ఇన్సిడియస్ (నెట్‌ఫ్లిక్స్‌)

అక్టోబర్ 6: ముంబై డైరీస్ (అమెజాన్ ప్రైమ్)
అక్టోబర్ 6: గదర్ 2(హిందీ), (జీ5)
అక్టోబర్ 6: మిస్టర్ ప్రెగ్నెంట్, ది గ్రేట్ (ఆహా)
అక్టోబర్ 4: ఇండియన్ సూసైడ్ (హాట్ స్టార్)
అక్టోబర్ 4: హంటెడ్ మాన్షన్ (వెబ్ సిరీస్), (హాట్ స్టార్)

థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
అక్టోబర్ 6: మామ మశ్చీంద్ర
అక్టోబర్ 6: రూల్స్‌ రంజన్
అక్టోబర్ 6: మంత్ ఫ్ మధు
అక్టోబర్ 6 : మ్యాడ్
అక్టోబర్ 6 : 800
అక్టోబర్ 6 : చిన్నా

Related Articles

Latest Articles

You cannot copy content of this page