Monday, July 1, 2024

Miss.Shetty Mr.Polishetty OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న నవీన్‌ పొలిశెట్టి మూవీ.. ఎప్పుడంటే

Miss.Shetty Mr.Polishetty OTT Release : జాతిరత్నాలు తర్వాత నవీన్‌ పొలిశెట్టి రేంజ్‌ బాగా పెరిగింది. కరోనా టైమ్‌లో వచ్చిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత తీసే మూవీ మళ్లీ అదే రేంజ్‌లో ఉండాలని నవీన్‌ పొలిశెట్టి బాగా గ్యాప్‌ తీసుకున్నాడు. ఆడియన్స్‌ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను తీశారు. ఈ మూవీ సెప్టెంబర్‌ 7 న థియేటర్లో రిలీజ్‌ అయింది. మరి ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా..?

మిస్టర్‌ శెట్టి మిస్‌ పొలిశెట్టి మూవీ అక్టోబర్‌ 5న ఓటీటీలోకి రానుంది. ప్రముఖ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకుంది. నవీన్‌ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు చాలా వెయిట్‌ చేశారు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలతో వరుస విజయాలు అందుకున్న నవీన్‌ పొలిశెట్టికి ఈ సినిమా ప్లస్‌ అయిందా మైనస్‌ అయిందా..? ఎమోషనల్‌, సీరియస్‌ లవ్‌ ట్రాక్‌ కంటే నవీన్‌ పొలిశెట్టి స్క్రీన్‌పై ఉంటే.. ఆ ఆనందమే వేరు. తన కామెడి టైమింగ్‌తో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు తెప్పిస్తాడు.

ఈ సినిమాలో జయసుధ, మరళీ శర్మ, తులసి, అభినవ్‌ గోమఠం కీలకపాత్రల్లో నటించారు. రధన్‌ సంగీతం సమకూర్చగా, మహేష్‌బాబు దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కింది.

ఇంతకీ కథేంటంటే..

లండన్‌లో అన్విత రవళిశెట్టి( అనుష్క) మాస్టర్ చెఫ్‌. తనకు ప్రేమ, పెళ్లిపై అస్సలు నమ్మకం ఉండదు. తన తల్లి జయసుధ ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోవడంతో రవళిశెట్టి ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ తల్లి చనిపోయాక ఒంటరైనా రవళిశెట్టి ఐయూఐ విధానంలో తల్లి కావాలనుకుంటుంది. స్పెర్మ్‌ డొనేటర్‌ కోసం చూస్తున్న క్రమంలో స్టాండప్‌ కమీడియన్‌ మన నవీన్‌ పొలిశెట్టి ఎంట్రీ ఇస్తాడు. సిద్ధు పొలిశెట్టిలో రవళి తన బిడ్డకు కావాల్సిన లక్షణాలను చూస్తుంది. అయితే ఈ క్రమంలోనే సిద్ధు అన్విత ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే వారి మధ్య కొన్ని ఎమోషన్, ఫన్నీ సీన్స్‌ నడుస్తాయి. సిద్ధు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేస్తాడు, రవిళిశెట్టి నిర్ణయాన్ని ఎలా మారుస్తాడు, చివరికి ఇద్దరు కలిశారా లేక అన్విత నిర్ణయమే గెలస్తుందా ఇవన్నీ ప్రేక్షకుడికి ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి.

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్‌, మళయాలం, కన్నడ, హిందీలో కూడా రిలీజ్‌ అయింది. రూ.12.5 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే.. బాక్స్‌ ఆఫీస్‌ వద్ద 47.20 కోట్లు రాబట్టింది. ఈ మూవీ థియేటర్లలో హిట్‌ టాక్‌ను క్రియేట్‌ చేసింది. నవీన్‌ పొలిశెట్టి మూవీ అంటే.. ప్రేక్షకులు ముందే కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. వాళ్ల అంచానాలకు తగ్గట్టుగా నవీన్‌ పొలిశెట్టి తన పాత్రకు న్యాయం చేశారు. అన్విత పాత్రలో అనుష్క కూడా చాలా చక్కగా సెట్‌ అవుతుంది. దర్శకుడు ఆమె పాత్రను చాలా హుందాగా తీర్చిదిద్దారు. ఆమెకు నవీన్‌కు మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. కొన్ని సీన్స్‌లో కడుపుబ్బా నవ్విస్తే.. మరికొన్ని సీన్స్‌లో ఎమోషనల్‌ టచ్‌తో కంటతడిపెట్టిస్తాడు.

దర్శకుడు తాను రాసుకున్న కథకు కాస్త బోల్డ్‌ టచ్‌ ఇచ్చినా హద్దు మీరకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని కామెడిగానే తెరకెక్కించాడు. అయితే సినిమాకు కొన్ని మైనస్‌ పాయింట్స్‌ కూడా ఉన్నాయి. అనుష్కకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోవడానికి తనకున్న కారణాలను ప్రేక్షకులకు సరిగ్గా చూపించలేకపోయారు. సినిమా అంతా తిరిగేది ఆ లైన్ చుట్టూనే. కానీ అనుష్క గతాన్ని ప్రేక్షకులకు ఫీల్‌ అయ్యేలా చేయకపోవడం బాగా మైనస్‌ అయింది. స్టాటింగ్‌ కొంచె లాగ్‌ ఉన్నా నవీన్‌ పొలిశెట్టి ఎంట్రీ ఇచ్చాక పిక్చర్‌ మారిపోతుంది. మొత్తంగా కామెడీ మూవీస్‌ను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్లో మిస్‌ అయిన వాళ్లు అక్టోబర్‌ 5న నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్‌ చేసేయండి.

Related Articles

Latest Articles

You cannot copy content of this page