Monday, July 1, 2024

Netflix OTT Movies : నెట్‍ఫ్లిక్స్ మూవీ ఫెస్టివల్.. అక్టోబర్‍లో సినిమాలే సినిమాలు

Netflix October 2023 Movies : ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్‍ నెలలో భారీగా ఎత్తున సినిమాలను విడుదల చేయనుంది. 15వ తేదీ వరకూ సినిమా జాతర తీసుకొస్తుంది.
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ గురించి అందరికీ తెలిసిందే. కొత్త కంటెంట్ ఇస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అన్ని రకాల జోనర్స్, వెబ్ సిరీస్‍లు విడుదల చేస్తూ.. సబ్‍స్ర్రైబర్స్ ను తెగ పెంచేసుకుంది. దానికి తగ్గట్టుగానే సినిమాలను ప్రకటిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్త సినిమాలను చూపిస్తోంది. మెుదట్లో హాలీవుడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది నెట్‍ఫ్లిక్స్. తర్వాత తన మార్కెట్ పెంచుకుంది. ఇప్పుడు సౌత్ సినిమాలు సైతం ఎక్కువగానే కొనుగోలు చేస్తోంది.

రకరకాల జోనర్స్ సినిమాలు విడుదల చేస్తూ.. ప్రేక్షకులను కట్టిపారేస్తుంది. ఇక ఈ అక్టోబర్‍లో అయితే మూవీ ఫెస్టివల్ ప్రకటించింది నెట్‍ఫ్లిక్స్. అక్టోబర్ 15 వరకూ సినిమా జాతర అనౌన్స్ చేసేసింది. ఒకటి రెండు సినిమాలు కాదు.. చాలా సినిమాలను తన వ్యూయర్స్ కోసం తీసుకొస్తుంది. అందులో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. వెబ్‍సిరీస్‍లు ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది నెట్‍ఫ్లిక్స్.

ఇప్పటికే అక్టోబర్ 1న విజయ్ దేవరకొండ-సమంత నటించిన ఖుషి సినిమా విడుదల అయింది. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలై బ్లాక్ బస్ట్ కామెడీ హిట్ అందుకున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటించారు. థియేటర్లలో బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఓటీటీ ప్రేక్షకులను నవ్వించేందుకు అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

నెట్‍ఫ్లిక్స్ సినిమా లిస్ట్ చూస్తే..
అక్టోబర్ 1 – స్పైడర్ మ్యాన్ : ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్
అక్టోబర్ 1 – మీన్ గర్ల్స్
అక్టోబర్ 1 – ది బిగినింగ్
అక్టోబర్ 1- పవర్ రేంజర్స్
అక్టోబర్ 4 – బెక్‍హామ్
అక్టోబర్ 5- ఖుషియా
అక్టోబర్ 5-లుపిన్ : పార్ట్
అక్టోబర్ 6-బల్లెరినా
అక్టోబర్ 6-ఫెయిర్ ప్లే
అక్టోబర్ 6-ఇన్సిడియస్ : ది రెడ్ డోర్
అక్టోబర్ 7-స్ట్రాంగ్ గర్ల్ నామ్-సూన్
అక్టోబర్ 10-జురాసిక్ వరల్డ్:డొమినియన్
అక్టోబర్ 10- DI4RIES : S2 Part 1
అక్టోబర్ 11- జెమినీ మ్యాన్
అక్టోబర్ 12-ది ఫాల్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ఉషర్
అక్టోబర్ 13- స్పై కిడ్స్
అక్టోబర్ 15-ది డిక్టేటర్

Related Articles

Latest Articles

You cannot copy content of this page