Monday, July 1, 2024

Sapta Sagaralu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సప్త సాగరాలు దాటి సినిమా

ఈ మధ్య సినిమాలు థియేటర్లలో కంటే.. ఓటీటీలోనే ఎక్కువగా ఆడుతున్నాయి. థియేటర్లో రిలీజ్‌ అయిన వారానికే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యే రిలీజ్‌ అయిన సప్తసాగరాలు దాటి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రక్షిత్‌ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ మంచి లవ్‌ స్టోరీగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమమ్‌ తర్వాత మళ్లీ ప్రేక్షకులను కంట తడపెట్టించిన లవ్‌ స్టోరీ ఇదే.

అమెజాన్‌ ప్రేమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలో ఈ మూవీని చూడొచ్చు. సెప్టెంబర్‌ 22న తెలుగు వర్షన్‌లో ఈ మూవీ థియేటర్లో రిలీజ్‌ అయింది. అసలు థియేటర్లో రిలీజ్‌ అయిన వారానికే ఓటీటీకి రావడం హైలెట్‌.. సినిమా బాలేదేమో అందుకే.. థియేటర్‌ నుంచి తోలేశారు అనుకుంటారేమో. అలాంటిదేం లేదు. ఈ మూవీ రొమాంటిక్‌ మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. హేమంత్‌ ఎమ్‌ రావు ఈ మూవీకి దర్శకత్వం వహించగా..చరణ్‌ రాజ్‌ సంగీతం సమకూర్చారు. పీపుల్‌ మీడియా బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కింది. హీరో హీరోయిన్‌ తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు.

కేజీయఫ్‌, కాంతార లాంటి సినిమాలు కన్నడ నుంచి తెలుగులో రిలీజై అయి ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నాయో మనకు బాగా తెలుసు. కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి మాస్‌ సినిమాలు చేస్తూనే.. మధ్యలో ఇలాంటి లవ్‌ స్టోరీస్‌ను ట్రై చేస్తున్నాడు. కన్నడలో ఈ మూవీ సప్తసాగరదాచే ఎల్లో అనే పేరుతో రిలీజ్‌ చేశారు. ఇదే సినిమాను తెలుగులో.. సప్తసాగారాలు దాటి సైడ్‌ ఏ పేరుతో తీశారు.

ప్రేమ‌లో ప‌డిన ఓ జంట ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. సొంత ఇల్లు కట్టుకోవాలన్న తమ కలతో.. చేయని నేరాన్ని హీరో నెత్తిన వేసుకుంటాడు. ఆ తర్వాత హీరో జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూపించడమే సినిమా కథ.సినిమాలో ఎమోషన్స్‌ సీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. థియేటర్లో కంటతడి పెట్టించే మూవీస్‌లో ఇదీ ఒకటి. ప్రేమ‌జంట మ‌ధ్య కెమిస్ట్రీ, భావోద్వేగాలే ఈ సినిమాకి కీల‌కం. సెకండ్‌ ఆఫ్‌ మొత్తం జైలు సీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇందులో లాగ్‌ ఎక్కువగా ఉండటమే సినిమాకు మైనస్‌ అయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉందట. పూర్తి క‌థ‌ని చూడాలంటే సైడ్-బి పేరుతో విడుద‌ల‌య్యే రెండో భాగం సినిమా వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందేనట.

ఈ సినిమా కర్ణాటకలో తొలి రోజు 2 కోట్లు, రెండో రోజు 2.5 కోట్లు, మూడో రోజు 3.5 కోట్ల రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఈ సినిమా 12 కోట్ల రూపాయల షేర్‌ను వసూలు చేసింది. ఇక తెలుగులో విడుదలైన సప్త సాగరాలు దాటి మూవీ ప్రమోషన్స్ భారీగా చేయడంతో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇది క్లాస్ మూవీ కావడంతో మాస్ ఆడియన్స్‌కి ఈ సినిమా అస్సలు ఎక్కలేదు. అందుకేనేమో తెలుగులో కలెక్షన్స్ మాత్రం చాలా దారుణంగా వచ్చాయి. ఏది ఏమైనా సినిమాను థియేటర్లలో మిస్‌ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయొచ్చు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page