Monday, July 1, 2024

Skanda OTT Release : భారీ ధరకు స్కంద డిజిటల్ రైట్స్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే

Skanda OTT Streaming DAte : రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద. థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటుంది. అయితే ఈ చిత్రం ఓటీటీ విడుదలపై అప్డేట్ వచ్చింది. స్కంద ఓటీటీ విడుదల తేదీ, డిజిటల్ రైట్స్ కు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే.. ఆ కిక్కే వేరు. అఖండతో మరోసారి మాస్ బాలయ్యను చూపించాడు బోయపాటి శ్రీను. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. మ్యాజిక్ అయితే గూస్ బంప్స్. ఆ తర్వాత బోయపాటి సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి స్కంద మూవీ తీశాడు. మరోవైపు శ్రీలీల హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ది వారియర్ సినిమాతో ఆలోచనల్లో పడ్డాడు. ఓ మంచి మాస్ మసాలా సినిమా తీయాలనుకున్నాడు. బోయాపాటితో చేతులు కలిపాడు. స్కంద సినిమాపు మెుదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్ తో సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలోనూ మంచి టాక్ తెచ్చుకుంటుంది.

స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. సుమారు 50 కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు. వరల్డ్ వైడ్‍గా సెప్టెంబర్ 28న చిత్రం విడుదలైంది. తెలుగుతోపాటుగా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేశారు. బోయపాటి మాస్ డైరెక్షన్ సినిమాలో కనిపిస్తోంది.

ఇక ఇప్పుడు స్కంద సినిమా ఓటీటీ రైట్స్ గురించి చర్చ నడుస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాను భారీ ధరకు కొనుగోలే చేసిందని టాక్ నడుస్తోంది. సినిమా విడుదల తేది తర్వాత 40 రోజులకు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ చివరి వారం లేదంటే.. నవంబర్ మెుదటి వారంలో స్కంద సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భారీ ధరకు హాట్ స్టార్ కొనుగోలు చేసిందట.

ఇక స్కంద సినిమాలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా చేశారు. ఊర్వశి రౌతెలా ఐటమ్ పాటకు డ్యాన్స్ చేసింది. శ్రీకాంత్, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు స్కంద 2 కూడా తీయనున్నట్టుగా ప్లాన్ చేశారట. నిజానికి బోయపాటి స్కంద తర్వాత అఖండ సీక్వెల్ ప్లాన్ చేశాడు. బాలయ్యతో ఈ సినిమా అయిపోయాక.. రామ్ పోతినేనితో స్కంద 2 తీసే ఆలోచనల్లో ఉన్నాడని అంటున్నారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page