Monday, December 23, 2024

Nene Naa OTT: రెజీనా నేనే నా సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

రెజీనా కసాండ్రా తెలుగులో నటించింది కొద్ది సినిమాల్లోనే అయినా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు హిందీ చిత్రాలు, ఓటీటీ షోలో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. ఆమె తెలుగులో నటించిన నేనే నా మూవీ ఆగస్టులో విడుదలైంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న నేనే నా మూవీ ఎట్టకలేలకు ఓటీటీకి వచ్చింది. ఇది ఎందులో స్ట్రీమింగ్‌ అవుతుందంటే..

ప్రముఖ తమిళ, తెలుగు OTT ప్లాట్‌ఫామ్ ఆహా ఈ థ్రిల్లర్ పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. నల్గొండలో ఒక అడవి మధ్యలో ఒక హత్య మిస్టరీని ఛేదించడానికి పోలీసులకు సహాయపడే ఒక ఆర్కియాలజిస్ట్ దివ్య (రెజీనా కసాండ్రా) చుట్టూనే ఈ కథంతా తిరుగుతుంది. దర్యాప్తు రహస్యాల కనిపెట్టడం, ఇదే సమయంలో హత్యలు జరుగుతాయి. నేరాల వెనుక ఎవరున్నారు? ఎందుకు చంపుతున్నారు? ఈ సంఘటనలకు దివ్యకి సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలతో నేనే నా సినిమా ట్విస్ట్‌లతో కూడిన చిల్లింగ్ థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకులను అలరిస్తుంది.

అక్షర గౌడ, వెన్నెల కిషోర్, JP, తాగబోతు రమేష్, జీవా రవి, మైఖేల్, రాచపూడి కౌశిక్, యోగి, రవి రాజా కీలక పాత్రలు పోషించారు. వీళ్లంతా తెలుగు ప్రేక్షకులకు ఎఫ్పటినుంచో తెలిసినవాళ్లే అవడం ఈ చిత్రానికి ప్లస్‌ అయింది. వెన్నెల కిషోర్‌ కామెడీ సినిమాలో ఇంకా హైలెట్ ఉంటుంది. డబుల్‌ రోల్ ప్లే చేసిన రెజీనా రెండు పాత్రలకు న్యాయం చేసింది. యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజ్ శేఖర్ వర్మ ఈ థ్రిల్లర్‌ను నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపొందింది. సామ్ సిఎస్ సంగీతం అందించగా, గోకుల్ బెనోయ్ కెమెరా వర్క్ చేశారు.

సాబు జోసెఫ్ ఈ చిత్రానికి ఎడిట్ చేయగా, రామజోగయ్య శాస్త్రి ఈ చిత్రానికి ఏకైక గీత రచయిత. సూపర్ సుబ్బురాయన్ స్టంట్స్ పర్యవేక్షించారు. సీను ఆర్ట్ డైరెక్టర్, షెరీఫ్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. రెజీనా 2023లో నేనే నాతో పాటు వెబ్ సిరీస్ ఫర్జీ, జాన్‌బాజ్ హిందుస్తాన్ కే, తమిళ చిత్రం కరుంగాపియం (కాజల్ అగర్వాల్‌తో పాటు)తో సహా పలు చిత్రాల్లో నటించింది.

Related Articles

Latest Articles