Wednesday, July 3, 2024

Jawan collections: బాక్సాఫీసును షేక్ చేసిన జవాన్.. 1000 కోట్లు వసూళ్లు

అట్లీ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్‌ చిత్రం విడుదలైన 19 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించింది. కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌ ఖాన్‌ నటించిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళంలో సెప్టెంబర్ 7న రిలీజై అయింది. రిలీజ్‌ అయిన మొదటి రోజు నుంచే కలెక్షన్స్‌తో దాడి చేసి బాక్స్‌ ఆఫీస్‌లో బంపర్‌హిట్‌ కొటింది. తాజాగా మూడో వారంలో కూడా సక్సస్‌ఫుల్‌గా కలెక్షన్స్‌తో దూసుకెళ్లిపోతుంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000.92 కోట్ల కలెక్షన్స్‌ సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు. ఒక్క హిందీలోనే రూ. 505.94 కోట్లు రాబట్టింది. వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన 6వ భారతీయ చిత్రంగా ‘జవాన్’ నిలిచింది. దీని కంటే ముందు ‘దంగల్’, ‘బాహుబలి 2’, ‘RRR’, ‘KGF 2’ ‘పఠాన్’ చిత్రాలు ఈ ఘనత సాధించాయి. ఈ ఏడాది షారుఖాన్‌ పఠాన్ చిత్రంతో బాక్సాఫీస్‌లో హిట్‌ కొట్టారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పఠాన్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తూ జవాన్‌ మూవీ దూసుకుపోతుంది. ఒక్క ఏడాదిలోనే రెండు వెయ్యికోట్ల రూపాయల వసూళ్లు తెచ్చిన హీరోగా షారుఖాన్‌ చరిత్ర సృష్టించారు. ఈ సినిమాతో దర్శకుడు అట్లీ కూడా అరుదైన గుర్తింపు పొందాడు. తమిళ్‌లో వెయ్యికోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమాగా జవాన్‌ నిలిచింది.

ఇప్పటికే రెండు వెయ్యికోట్లు సినిమాలున్న హీరోగా రికార్డు సృష్టించిన SRK హ్యాట్రిక్‌ కొట్టేదిశలో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో వస్తున్న డుంకీ సినిమా క్రిస్మస్‌కు రిలీజ్‌ కానుంది. మొదట ఈ సినిమా జనవరిలో రిలైజ్‌ అవుతుందని టాక్‌ నడిచినప్పటికీ.. జవాస్‌ సక్సస్ మీట్‌లో షారుఖాన్‌ జవాన్‌ జన్మాష్టమికి విడుదలైంది.. డుంకీ క్రిస్మస్‌కు రిలైజ్‌ అవుతుందని చెప్పాడు. ఈ మూవీ కూడా వెయ్యికోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందంటే.. షారుఖాన్‌ వెయ్యికోట్ల సినిమాలకు ఒక బెంచ్‌ మార్క్ సెట్‌ చేసిన మొదటి హీరో అవుతాడు. అది కూడా ఒక్క ఏడాదిలోనే.! ఇప్పటి వరకూ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండ్రస్టీలోనే ఈ రికార్డు ఎవ్వరికీ సాధ్యం కాలేదు. షారుఖాన్‌ హీరోగా తాప్సీ హీరోయిన్‌గా డుంకీలో నటిస్తున్నారు. సంజయ్ దత్ సహా పలువురు నటీనటులు ఈ మూవీలో కనిపించబోతున్నారు. మొత్తంగా ఈ చిత్రంతో షారుఖ్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయంగా భావిస్తున్నారు అభిమానులు.

ఓటీటీలోకి ఎప్పుడంటే..

జవాన్‌ చిత్రంలో షారుఖాన్‌ డ్యూయల్‌ రోల్‌ ప్లే చేశారు. నయనతార హీరోయిన్‌గా నటించింది. కీలకపాత్రల్లో ప్రియమణి, సంజయ్ దత్, దీపికా పదుకునే, యోగి బాబు నటించారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మెుదటి వారంలోనే జవాన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page