Wednesday, July 3, 2024

Gandeevadhari Arjuna in OTT: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటింటిన యాక్షన్ డ్రామా గాంఢీవధారి అర్జున చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. 42 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో కూడా చూడవచ్చు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువ హీరోయిన్ సాక్షి వైద్య జంటగా ఈ సినిమాలో నటించారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఈ చిత్రంలో వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమతం, రవివర్మ, కల్పలత, బేబీ వేదయిన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించిన ఈ చిత్రం మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గాంఢీవధారి అర్జున చిత్రం బాలివుడ్‌ ప్రమాణాలతో తీశారు. కానీ రిలీజ్‌ అయిన మొదటి రోజే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ రాకకపోవడంతో..ఫుల్‌ నెగిటివ్‌ టాక్‌ ఏర్పడింది.

ఫారిన్‌లో ఉండే చెత్తను ఇండియాలో డంప్‌ చేయడం వల్ల కలిగే నష్టాలను ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే యాక్షన్‌ థ్రిల్లర్‌ అనగానే మనకు యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్, సస్‌పెన్స్‌ ఇవన్నీ ఎక్స్‌పెట్‌ చేస్తాం. కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏం లకేపోవడంతో.. ప్రేక్షకులను అంతగా థియేటర్లకు రప్పించుకోలేకపోయింది. అభివృద్ది పేరుతో అగ్రదేశాలు తమ దేశంలోని చెత్తనంతా భారత్‌ లాంటి దేశాలకు పంపుతూ, ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బదీస్తున్నారనే మంచి పాయింట్‌ని ఎంచుకున్నారు. కానీ దాన్ని చూపించడంలో విఫలం అవడంతో సినిమా ఫ్లాప్‌ అయిందని విమర్శకులు అంటున్నారు. యాక్షన్‌, ఎమోషన్స్‌ని డైరెక్టర్‌ సరిగ్గా బ్యాలెన్స్‌ చేయకపోవడం ఈ సినిమాకు బాగా మైనస్‌ అయింది.

అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా.. ఓటీటీలో మాత్రం చెలరేగిపోతాయి. అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి.. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ తెప్పించుకుంటుందో చూడాలి. వన్‌ టైమ్‌ వాచ్‌గా సినిమాను చూడొచ్చని చూసిన ప్రేక్షకులు అయితే అంటున్నారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page