Monday, July 1, 2024

Nene Naa Movie Review : నేనే నా మూవీ రివ్యూ.. రెజీనా సినిమా ఎలా ఉందంటే.

Nene Naa Movie Review : హీరోయిన్ రెజీనాకు కొన్ని రోజులుగా సరైన పాత్రలు రావడం లేదు. తాజాగా ఆమె నటించిన పీరియాడిక్ డ్రామా మూవీ నేనే నా సినిమా ఆహా ఓటీటీలో స్త్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

సినిమా : నేనే నా
నటీనటులు : రెజీనా, వెన్నెల కిశోర్, జయప్రకాశ్, తాగుబోతు రమేశ్, జీవా రవి, అక్షర గౌడ తదితరులు, సినిమాటోగ్రఫీ : గోకుల్ బినోయ్, ఎడిటింగ్ : వీజే సాబు జోసెఫ్, సంగీతం : సామ్ సీఎస్, కథ దర్శకత్వం : కార్తీక్ రాజు, నిర్మాత : రాజశేఖర్ వర్మ.
కథ ఏంటంటే..
నల్లమల అడవిలో ఓ విదేశియుడు అనుమానస్పదంగా చనిపోతాడు. అతడి డెడ్ బాడీని బయటకు తీయడానికి ఆర్కియాలజిస్ట్ దివ్య(రెజీనా) సాయాన్ని డీఎస్పీ(జయప్రకాశ్) తీసుకుంటాడు. అదే అడవిలో రేంజర్ ఆఫీసర్ గా పని చేస్తాడు బొబ్బిలి రాజా(వెన్నెల కిశోర్). అతడి సాయంతో విదేశియుడు చనిపోయిన ప్లేసులో తవ్వగా.. వందేళ్ల క్రితం నాటి యువతి స్కెల్టన్ దొరుకుతుంది. దీంతో షాక్ అవుతారు. ఫొరెనిక్స్ పరీక్షల కోసం పంపిస్తారు.

అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. విదేశియుడు చనిపోయిన ప్రదేశంలోనే డీఎస్పీ కూడా చనిపోతాడు. ఆ కేసు కాస్త దివ్యపై పడుతుంది. డీఎస్పీ మరణించాడు? విదేశియుడి డెడ్ బాడీ ఏమైంది? దివ్యలాగా ఉన్న మరొకరు ఎవరు? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ
ఈ సినిమాలో రెజీనా మంచి క్యారెక్టర్ చేసింది. పాత్రకు తగ్గట్టుగా నటించింది. రివేంజ్ డ్రామాను.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‍లో తీశాడు డైరెక్టర్ కార్తీక్ రాజు. అయితే సినిమా ఏదో నడుస్తుందంటే నడుస్తుందని కొన్ని సీన్లలో అనిపిస్తుంది. మంచి కథను ఎంచుకున్నాడు. కానీ ఆసక్తిగా చెప్పడంలో విఫలమైనట్టుగా అనిపిస్తుంది. కాస్త వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో డబుల్ రోల్ చేసింది రెజీనా. మరో రెజీనా కనిపించినప్పుడు రివేంజ్ డ్రామా అని అర్థమవుతుంది. అయితే ఆమెకు జరిగిన అన్యాయం ఏంటని కాస్త ఆసక్తిగా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఎక్కడో దర్శకుడు లైన్ తప్పినట్టుగా అనిపిస్తుంది. సహజంగా అనిపించకుండా ఆ పార్ట్ తీశాడు.

రెండు పాత్రల్లో రెజీనా పాత్ర బాగుంటుంది. ఆర్కియాలజిస్ట్ దివ్య, దమయంతిగా బాగా నటించింది. అక్షర గౌడను గ్లామర్ కోసం ఉపయోగించారు. జయప్రకాశ్ నటన కూడా బాగుంది. వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ కాస్త సినిమాను నిలబెట్టిందని చెప్పొచ్చు.

సామ్ సంగీతం కూడా కొన్ని సీన్లలో బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ కోసం ఇచ్చిన మ్యూజిక్ మాత్రం నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలో కొన్ని లాజిక్స్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయోచ్చు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page