Monday, July 1, 2024

The Vaccine War Review : ది వ్యాక్సిన్ వార్ రివ్యూ.. ఈ సినిమా ఎవరి పక్షం?

The Vaccine War Review Telugu : వ్యాక్సిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త కథే ది వ్యాక్సిన్ వార్. ఇది టీకా తయారీ ప్రక్రియలో అనేక దశలను చూపిస్తుంది. ఓ డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు చూపించడం ద్వారా సినిమా పరిస్థితి మారిపోయింది. ఇంతకీ ది వ్యాక్సిన్ వార్ సినిమా ఎలా ఉంది?

అగ్నిహోత్రి, నటీనటులు : నానా పటేకర్, పల్లవి జోషి, సప్తమి గౌడ, గిరిజా ఓకా, అనుపమ్ ఖేర్ తదితరులు, చిత్రం: ది వ్యాక్సిన్ వార్, నిర్మాత: పల్లవి జోషి, దర్శకత్వం: వివేక్

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి మంచి పాపులారిటీ వచ్చింది. ఆయన దర్శకత్వంలో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా విడుదలైంది. రెండు సినిమాల మేకింగ్ లోనూ ఓ పోలిక ఉంది. మామూలు కమర్షియల్‌ ఫార్ములాలను వదిలి తనదైన శైలిలో ది వ్యాక్సిన్‌ వార్‌ చిత్రాన్ని రూపొందించారు. కోవిడ్ సమయంలో భారతీయ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను కనుగొన్న సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. వ్యాక్సిన్‌తో పాటు డిఫరెంట్ ఐడియాలను చెబుతూ ఈ సినిమా సాగుతుంది. శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపేలా చిత్రం ఉంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డా. బలరామ్ భార్గవ రాసిన ‘గోయింగ్ వైరల్’ అనే పుస్తకం ఆధారంగా ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా తెరకెక్కింది. చాలా మంది సైంటిస్టులను ఇంటర్వ్యూ చేసి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సినిమాకు మేలు చేసేలా కొన్ని మార్పులు చేశారు. కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రక్రియ ఎంత సవాలుతో కూడుకున్నదో ఈ చిత్రం వివరిస్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు కొంత సమాచారాన్ని కూడా అందిస్తుంది. కానీ వినోదం ఆశించకూడదు. కమర్షియల్ సినిమాల తరహాలో వినోదాత్మకంగా సాగే పాటలు, ఫైట్లు, పంచ్ డైలాగులు లేకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకునే గుణం ఈ సినిమాకు ఉంది.

ఇది పూర్తిగా వ్యాక్సిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల కథ. టీకా తయారీ ప్రక్రియలో అనేక దశలను చూపిస్తుంది. శాస్త్రవేత్త వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? వారిపై ఎంత ఒత్తిడి ఉంది? వంటి అంశాలు ఎక్కువగా హైలైట్ చేశారు. అక్కడక్కడ సినిమాటిక్ టచ్ ఇచ్చారు.

వివేక్ అగ్నిహోత్రి ఏకపక్షంగా ఓ ఐడియాలజీని పెట్టుకుని సినిమా తీశారని ఆరోపణలు వచ్చాయి. ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సినిమా చూసినప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ సరైనవేనని, ప్రభుత్వ పక్షంలో ఎలాంటి లోపం లేదని చెబుతుంది సినిమా. అకస్మాత్తుగా లాక్‌డౌన్ కారణంగా సామాన్యులకు ఎదురయ్యే సమస్యలు, నిర్వహణ లోపంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సమస్యలతో సహా ఈ సినిమా ఎలాంటి సమస్యలను ప్రశ్నించదు. వ్యాక్సిన్‌ని కనిపెట్టిన సైంటిస్టుల మధ్య జరిగే వన్‌సైడ్‌ సంభాషణలా సినిమా మొత్తం సాగుతుంది. ఈ సినిమాలో మీడియానే ఇండియా యాంటీ టీకా అన్నట్లుగా చిత్రీకరించారు. మీడియా చేసిన మంచి పనుల గురించి ఈ సినిమా అస్సలు మాట్లాడదు.

నటుడు నానా పటేకర్ డా.బలరాం భార్గవ పాత్రలో ఇమిడిపోయారు. సినిమా మొత్తానికి అతని పాత్ర హైలైట్ అవుతుంది. నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు సైంటిస్టుల పాత్రలో సప్తమి గౌడ, పల్లవి జోషి, గిరిజా ఒకా తదితరుల నటన కూడా మెచ్చుకోదగినది. సప్తమి గౌడ అక్కడక్కడా సన్నివేశాల్లో కనిపిస్తుంది. అయితే, ఇది ఆమె కెరీర్‌లో అరుదైన పాత్రగా మిగిలిపోతుంది. అనుపమ్ ఖేర్ కి అంత స్క్రీన్ స్పేస్ రాలేదు.
‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా నేపథ్య సంగీతం విభిన్నంగా ఉంటుంది. వీలైన చోటల్లా మౌనం పాటించారు. సంభాషణలను ముంచెత్తే నేపథ్య సంగీతం ఇందులో లేదు. కథను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే హడావుడి దర్శకుడు ప్రదర్శించలేదు. 2 గంటల 40 నిమిషాల ఈ సినిమా చాలా స్లో పేస్‌లో సాగుతుంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page