Saturday, June 29, 2024

Brahmamudi Serial : దుగ్గిరాల ఫ్యామిలీలోకి అనామిక.. ఏం గొడవలు పెడుతుందో ఇక?

దుగ్గిరాల వారి ఇంట్లో వినాయకచవితి వేడుకలు చేసుకుంటారు. అక్కడికి కనకం, కృష్ణమూర్తి, అప్పు కూడా వస్తారు. అపర్ణనను కనకం పలకరిస్తుంది. తాను కూడా మాట్లాడుతుంది. కానీ ఎప్పటిలాగే సెటైర్లు వేస్తుంది అపర్ణ. ఇలా అందరం కలిసినందుకు సంతోషంగా ఉందని చెబుతుంది కనకం. పైసా ఖర్చు లేకుండా దొరికేది సంతోషం ఒకటే కదా అని రుద్రాణి మరో మాట అంటుంది.

కొంతమందికి కోట్లు ఖర్చు చేసినా.. ఆ సంతోషం దొరకదు అని కావ్య వచ్చి కౌంటర్ ఇస్తుంది. కృష్ణమూర్తి వచ్చి రాజ్ గురించి పొగుడుతాడు. ప్రజల కష్టాలు తెలిసినోడే రాజు.. మీ మనవడు మీ సిద్ధాంతాలను నిలబెడతాడని సీతారామయ్యతో చెబుతూ ఉంటాడు.

ఇక అప్పుడు తల్లిదండ్రులతో అనామిక కూడా వస్తుంది. వాళ్లకు కావ్య ఆహ్వానం చెబుతుంది. వీరు మీతో మాట్లాడేందుకు వచ్చారు తాతయ్య అని పరిచయం చేస్తుంది. ఇలా ఉంటే ఎలా ఏదో ఒకటి చెప్పండి అని అంతా కల్యాణ్, అనామికను అంటారు. ఒకరికొకరు చూపించుకుంటారు. కల్యాణ్‍తో అనామిక పెళ్లి గురించి ఆమె తండ్రి మాట్లాడుతాడు. పిల్లలు ప్రేమించుకున్నారని పెళ్లిచేద్దామని వివరిస్తాడు. మేం నిర్ణయం తీసుకున్న.. కల్యాణ్ తల్లితండ్రుల నిర్ణయమే ఫైనల్ అంటాడు సీతారామయ్య. మా అత్తామామలు, మా అక్కయ్య నిర్ణయమే మా నిర్ణయం అని ధాన్యలక్ష్మి సమాధానం చెబుతుంది. చివరగా కల్యాణ్ ఇష్టమే నా ఇష్టం అని చెబుతుంది.

ఇక రుద్రాణి మళ్లీ తన మాటలు మెుదలుపెడుతుంది. వయసు వచ్చాక ఎవరైనా ప్రేమించుకుంటారని, మాతో వియ్యం అందుకునేందుకు మీకు ఉన్న అర్హత ఏంటని ప్రశ్నిస్తుంది. మీ అంత కాకపోయినా మేం కూడా సంపాదించామని అనామిక తల్లి చెబుతుంది. మీరు కావ్య లాంటి కుటుంబం నుంచి వియ్యం అందుకున్నారని, మాతో కూడా ఓకె చెబుతారని నమ్మకంతో వచ్చామని అంటుంది.

సరే.. వాళ్లు మా వియ్యంకులు, విగ్రహాలకు రంగులు వేస్తారు అని రుద్రాణి గుచ్చి మరి అంటుంది. వాళ్లు విగ్రహాలకు రంగులు వేస్తారు కానీ, మెుహాలకు రంగులు వేసుకుని లోపల ఒకటి పెట్టుకుని, బయటకు ఇంకోలా ఉండరని సుభాష్ కౌంటర్ ఇస్తాడు. వాళ్లు పేదవాళ్లైనా మా నుంచి ఒక్క సాయం కూడా తీసుకోలేదని రాజ్ కూడా మద్దతు ఇస్తాడు. ఇక మెుత్తానికి అనామిక, కల్యాణ్ పెళ్లికి ఇంట్లో వాళ్లందరూ ఒప్పుకుంటారు.

తర్వాత దుగ్గిరాలవారి ఇంట్లో సెలబ్రేషన్స్ మెుదలవుతాయి. పూజ చేసేందుకు తాడులాగే ఆటను ఆడతారు. ఈ క్రమంలో తాడు లాగుతూ ఉంటే.. కావ్యను పట్టుకోమని అపర్ణ చెబుతుంది. అత్తయ్య అంత అలా చెప్పేసరికి కావ్య సంతోషిస్తుంది. మగవాళ్లు గట్టిగా లాగడంతో కావ్య వచ్చి.. రాజ్ మీద పడుతుంది. అందరూ నవ్వుతారు. మగావాళ్లు గెలిచాం అని అరుస్తారు. మీకు బలం ఎక్కువ అందుకే గెలిచారని అనామిక అంటుంది. జంటలుగా ఒక్కో పోటీ ఉంటుందని సీతారామయ్య చెబుతాడు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page