Saturday, June 29, 2024

Jyothi Rai : రహస్యంగా పెళ్లి చేసుకున్న గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడమ్

Guppedantha Manasu Serial : గుప్పెడంత మనసు సీరియల్‍లో రిషి తల్లి జగతి గుర్తుంది కదా. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెుదటి భర్తకు ఆమె విడాకులు ఇచ్చిందని అంటున్నారు. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్‍ను పెళ్లి చేసుకుందని చెబుతున్నారు. దీనికి కారణం ఆమె వైరల్ ఫోటోలే.

కొద్ది రోజుల క్రితమే హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది జ్యోతి రాయ్. ఇప్పుడు మళ్లి పెళ్లితో వార్తల్లో నిలిచింది. నటి జ్యోతిరాయ్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. పద్మనాభ రాయ్‌ని వివాహం చేసుకుని.. ఆ తర్వాత రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. జ్యోతి, పద్మనాభ్ దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని రోజుల కిందట ఇద్దరూ విడిపోయినట్లు చెబుతున్నారు.

కన్నడ, తెలుగు సీరియళ్లలో బిజీబిజీగా ఉంది జ్యోతిరాయ్. సినిమాలలోనూ నటిస్తోంది. యువ దర్శకుడు సుకు పూర్వాజ్‌తో డేటింగ్ చేస్తుందనే వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. రెండు నెలల క్రితం కూడా ఓ ఫోటో షేర్ చేసింది. అప్పుడు కూడా వీరిద్దరూ రహస్యంగా మద్యం తాగినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేసిన నటి ఇప్పుడు మళ్లీ ఫోటోలను షేర్ చేసింది.

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో కూడా బిజీ నటిగా ఉంది. అయితే తాజాగా ఆమె సుకుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కింద ఓ రింగ్ ఎమోజీ పెట్టింది. దీంతో పెళ్లే అయిపోయిందని, ఒక్కొక్క విషయాన్ని మెల్లగా రివీల్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు జనాలు. కొన్ని రోజుల కిందట ఇద్దరూ పెళ్లి చేసుకుని పార్టీలో భాగంగా మందు తాగినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

జ్యోతిరాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో పెళ్లి చేసేసుకుందని అందరూ డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన విషయంపై ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇది మరింత గందరగోళానికి దారితీసింది. అయితే వీరిద్దరూ ఉన్న పోస్ట్ చూస్తుంటే పెళ్లి ఆల్రెడీ జరిగిపోయిందనే ఎక్కువ మంది అనుమానపడుతున్నారు.

ఇంతకుముందు, ఆమె ఇలాంటి ఫోటోలను షేర్ చేసినప్పుడు అన్ని ఫోటోలకు జ్యోతిపూర్వజ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించింది. జ్యోతి కూడా పూర్వాజ్ పేరుతో ట్విట్టర్ ఖాతా తెరిచింది. ఇక నుంచి మీరు నన్ను ట్విట్టర్‌లో ఫాలో అవ్వండి అని రాసుకొచ్చింది. అప్పుడే వీరిద్దరిపై గుసగుసలు మొదలయ్యాయి.

జ్యోతి రాయ్ రంగలు ప్రపంచంలోకి అడుగుపెట్టాకనే మెుదటి భర్తకు విడాకులు ఇచ్చిందని అంటున్నారు. జ్యోతి రాయ్ మొట్టమొదట కన్నడ సీరియల్‌లో కనిపించింది. తరువాత జ్యోతి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో చేస్తోంది. జోగుల, కిన్నారి, కస్తూరి నివాస్, జో జో లాలి, గెజ్జెపూజే సహా పలు సీరియల్స్‌లో పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో గుప్పెడంత మనసులో జగతి మేడమ్‍గా అందరికీ దగ్గరైంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page