Saturday, June 29, 2024

Krishna Mukunda Murari Serial : ముకుందకు షాక్ ఇచ్చిన కృష్ణ.. ఇక యుద్ధానికి సిద్ధమంటూ సవాల్

Krishna Mukunda Murari Today Episode : కృష్ణకు షాక్ ఇవ్వాలని ముకుంద అనుకుంటుంది. కానీ కృష్ణే ముకుందకు షాక్ ఇస్తుంది. మురారిని ప్రేమిస్తున్న విషయం కృష్ణతో చెప్పి.. ఆమెను హర్ట్ చేయాలనుకుంటుంది. కానీ ఆ విషయం నాకు తెలుసు అని కృష్ణ షాక్ ఇస్తుంది.

భవానీ ఫోన్లో కల్నల్ నెంబర్ తీసేయాలని అనుకుంటుంది మకుంద. అలా అయితే ఆదర్శ్ తో మాట్లాడేందుకు ఛాన్స్ ఉండదని పథకం వేస్తుంది. భవానీ తాగే పాలల్లో నిద్ర మాత్రలు వేసి ఇస్తుంది. కానీ చివరికి తన ప్లాన్ మార్చుకుంటుంది. ఇదంతా ఎందుకు.. నేరుగా.. మురారి విషయం చెప్పేద్దామని అనుకుంటుంది. పెళ్లైన తర్వాత రోజు నుంచే.. ఆదర్శ్ కోసం ఎదురుచూస్తున్నానని, ఇన్నాళ్లు రాని వ్యక్తి.. ఇప్పుడు ఎలా వస్తాడని తనకు నమ్మకం లేదని విషయాన్ని చెబుతుంది. అతడి కోసం వెతక్కొద్దు అని భవానీకి సలహా ఇస్తుంది. దీంతో భవానీ షాక్ అవుతుంది.

ఇంకోవైపు భవానీ గదికి ముకుంద వెళ్లిన విషయంతో కృష్ణ టెన్షన్ పడుతుంది. మురారి విషయం చెబుతుందేమోనని భయపడుతుంది. మురారి విషయం చెప్పాలని అనుకునే సమయంలో భవానీ గదిలో కృష్ణ కూడా వెళ్తుంది. అక్కడ నుంచి ముకుందను బయటకు తీసుకొస్తుంది. ఆదర్శ్ విషయం గురించి బాధపడొద్దని, ఎలాగైనా అతడిని తీసుకొస్తామని, తప్పకుండా వస్తాడని ముకుందతో అంటుంది కృష్ణ. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకోమని సలహా ఇస్తుంది.
కానీ ముకుంద మాత్రం ఊరుకోదు.. ఏది సాధించినా.. ఈ విషయంలో మాత్రం నువ్ ఫెయిల్ అవుతావని వార్నింగ్ ఇస్తుంది. నా ప్రేమ మీద నాకు చాలా నమ్మకం ఉందని అంటుంది ముకుంద. చనిపోయిన ప్రేమ తిరిగిరాదని అంటుంది కృష్ణ. ఇలా ఇద్దరి మధ్య వాదనలు జరుగుతాయి.

మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అని, పరిస్థితుల వలన దూరం అయ్యామని చెబుతుంది ముకుంద. మా ఇద్దరి మధ్యలోకి నువ్ వచ్చావని ఫైర్ అవుతుంది. నిజాలు తెలిసి.. షాక్ అయ్యావా అని కృష్ణను ప్రశ్నిస్తుంది. ఈ విషయాలు నాకు ఎప్పుడో తెలుసు అని ముకుందకు షాక్ ఇస్తుంది కృష్ణ. పెళ్లైనా మగాడిని కోరుకుంటుంది.. బరితెగించింది.. అని కృష్ణ మాట్లాడుతుండగా.. అడ్డుచెబుతుంది ముకుంద. ఎప్పుడు తెగుతుందో తెలియని బంధాన్ని పట్టుకుని వేళాడుతుంది నువ్వు అంటూ చెబుతుంది ముకుంద.

ఇద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది. నా మెడలో ఉన్న తాళికి విలువ లేదని, మురారి నా మెడలో తాళి కట్టినప్పుడే విలువ వస్తుందని చెబుతుంది ముకుంద. నేను ఉండగా అది జరగదని వార్నింగ్ ఇస్తుంది కృష్ణ. మురారి మనసులో నువ్ లేవంటే.. నువ్ లేవని ఇద్దరూ అనుకుంటారు.

మురారి మనసులో నాకు స్థానం ఉంది, అది ఇప్పుడా ఒకప్పుడా అనేది అప్రస్తుతం అని ముకుంద అంటుంది. నాకు ఇది ఉందని తాళి చూపిస్తుంది కృష్ణ. ఆ తాళి ఒక తాడు మాత్రమేనని లైట్ తీసుకుంటుంది ముకుంద. అయితే విలువలేని తాళి నీ మెడలో ఎందుకు, తీసేయమని ముకుందతో గట్టిగా అంటుంది కృష్ణ. కానీ ముకుంద ఆ పని చేయలేకపోతుంది.
ఇలా చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకుంటారు. పరాయి వాళ్ల భర్త కోసం నువ్ ఆరాటపడటం కరెక్ట్ కాదని కృష్ణ చెబుతుంది. ఆదర్శ్ కోసం వేచి చూడమని సలహా ఇస్తుంది. అది జరగని విషయం అని కృష్ణకు బదులిస్తుంది ముకుంద. ఆ విషయం కచ్చితంగా జరుగుతుందని, జరిపించేది తానే అంటూ కృష్ణ ఫైర్ అవుతుంది. ఇలా ఇద్దరు మురారి కోసం గొడవపడుతూ ఉంటారు.

Related Articles

Latest Articles

You cannot copy content of this page