Saturday, June 29, 2024

Krishna Mukunda Murari Serial : ప్రభాకర్ రీ ఎంట్రీ.. ఆదర్శ్ గురించి ఆరా.. ముకుంద-కృష్ణ గొడవ

కృష్ణ ముకుంద మురారి సీరియల్‍లో పెద్దపల్లి ప్రభాఖర్ రీ ఎంట్రీతో ఆసక్తిగా మారింది. వచ్చిరాగానే ఆమె భర్త ఆదర్శ్ గురించి ఆరా తీస్తాడు. మిలిటరీకి వెళ్లిన నా పెద్ద అల్లుడు(ఆదర్శ్) ఫోన్ చేస్తుండా అని భవానీని అడుగుతాడు ప్రభాకర్. కానీ శకుంతల ఏదీ అని మాట దాటేస్తుంది భవానీ. కొడుకు గురించి అడిగితే మాట దాటేస్తున్నావేంటని ప్రభాకర్ ఆలోచిస్తాడు.

రేపు పండగ కదా.. ధూమ్ ధామ్ చేయాలని ఆలోచిస్తున్నానని ప్రభాకర్ చెబుతాడు. నీకు నచ్చినట్టుగా చేయమని చెప్పి వెళ్లిపోతుంది భవానీ. ముకుంద ఇదంతా చూస్తూనే ఉంటుంది. ముకుంద సంగతి తేల్చాలని ప్రభాకర్ మనసులో అనుకుంటాడు.

మరోవైపు కష్ణ వెతుక్కుంటూ వస్తుంది. మురారి కోసం వెతుకుతున్నావా అని ముకుంద అనగా.. గుండె కోసం ఎవరైనా వెతుకుతారా అని సమాధానిస్తుంది కృష్ణ. గుండె కోసం ఎవరైనా వెతుకుతారా అని అంటుంది కృష్ణ. ఓహో మీ తొట్టి గ్యాంగ్ కోసమా అంటుంది. దీంతో ఇద్దరి మధ్య వాదన నడుస్తుంది. నన్ను పెద్దకోడలిగా చూపిద్దామనుకుంటున్నావ్ అని ముకుంద అనగా.. అది సమాజమే చూస్తుందని కృష్ణ కౌంటర్ వేస్తుంది.

కృష్ణ ఆలోచనల్లో పడగా.. షాక్ అయ్యావా అని ముకుంద అనగా.. లేదు జాలి పడుతున్నానని చెబుతుంది. నీ మాటలకు బెదిరేందుకు అలేఖ్యను కాదని కృష్ణ అంటుంది. వెళ్లి మీ తొట్టి గ్యాంగ్ తో ముచ్చట్లు చెప్పుకోమని అంటుంది ముకుంద. మీ నాన్నకు ఎంతో గౌరవం ఇస్తానని అంటుంది కృష్ణ. ముకుందపై కృష్ణ గట్టిగా సీరియస్ అవుతుంది.

ముకుంద చాలా కోపం తెప్పిస్తుందని మురారితో చెబుతుంది కృష్ణ. సంస్కారం లేని వాళ్లు అలానే చేస్తారులే.. వదిలేయ్ అంటాడు మురారి. రేపు బయటకు వెళ్లేది ఉందని, మళ్లీ ఎగ్గొట్టొద్దు అని కృష్ణ అనగా.. సరే అంటాడు.
ఇక ముకుంద వద్దకు శకుంతల వచ్చి ఆదర్శ్ గురించి గొప్పగా చెబుతుంది. ముకుంద ఆపండి అంటూ సీరియస్ అవుతుంది. వెంటనే మురారి, కృష్ణ, మధుకర్ కిందకు వస్తారు. ఈ విషయం ప్రభాకర్ కూడా వింటాడు. బంధువులతో
ఇలానేనా మాట్లాడేది అని కృష్ణ అనగా.. అడ్డమైన వాళ్లతో మాట్లాడను అని ముకుంద అరుస్తుంది.

కాసేపు మళ్లీ ఇద్దరూ అరుచుకుంటారు. తర్వాతి రోజు ఆదర్శ్ గురించి సమాచారం వచ్చిందని, సైనిక్ పురికి వెళ్లమని మురారితో భవానీ చెప్పగా నేను కూడా వెళ్తానని కృష్ణ అంటుంది. వినాయక చవితికి సంబంధించిన పండగను నువ్వే చూసుకోవాలని భవానీ అంటుంది. ఇదంతా ముకుంద ప్లాన్ ఆ అని ఆలోచనల్లో పడుతుంది కృష్ణ.

Related Articles

Latest Articles

You cannot copy content of this page