Saturday, June 29, 2024

Krishna Mukunda Murari Today Episode : బెడ్‌పై మురారి, కృష్ణ రొమాన్స్.. విడగొట్టే పనిలో ముకుంద

Krishna Mukunda Murari Today Episode : కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో భర్తల దినోత్సవం ప్లాన్ చేస్తుంది కృష్ణ. ముకుందకు అడుగడుగునా అడ్డు పడుతుంది. సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ఫోకస్ తనపైనే పెడుతుందని ముకుంద అనుకుంటుంది. మీ విషయం కృష్ణకు తెలిసిపోయందని అలేఖ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. ఇక తెలిసిపోయాక.. చేసేదేమీ ఉందని, ముసుగులో గుద్దులాటలు ఎందుకు కృష్ణ.. నేరుగా ఫైట్ చేద్దామని డిసైడ్ అవుతుంది ముకుంద.
మురారిపై కృష్ణ ప్రేమ
ముకుందకు హర్ట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది కృష్ణ. భోజనం అయిపోయి మురారి లేస్తుంటే.. ఏసీపీ సర్ అంటూ చేయి తడుచుకునేందుకు చీర కొంగును ఇస్తుంది కృష్ణ. మురారి మూతి తుడుస్తుంది. ఇంట్లో వాళ్లు అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ముకుంద మాత్రం రగిలిపోతూ ఉంటుంది. భోజనం అయిపోయాక.. గదిలోకి వస్తారు ముకుంద, కృష్ణ.
మురారిని బెదిరించిన కృష్ణ
కృష్ణ ఒక ఫొటో పట్టుకుని.. నిజాలు దాస్తే ఎలా ఉంటుందో మీకు ఇవాళ చూపిస్తాను అని మురారితో అంటుంది. దీంతో మురారి టెన్షన్ ఫీలవుతాడు. కొంపదీసి ఫామ్ హౌస్ ఫొటోలు ఏమైనా దొరికాయా అనుకుంటాడు. మురారి దగ్గరకు వెళ్తుంది కృష్ణ. మీరు ఇలా నిజాలు దాస్తారు అనుకోలేదు ఏసీపీ సర్ అని ఎమోషనల్ అవుతుంది.
కృష్ణ, మురారి రొమాన్స్
మురారి మాత్రం టెన్షన్ ఫీలవుతుంటాడు. గెస్ట్ హౌస్ ఫొటోలేమోనని భయంతో ఉంటాడు. ఏసీపీ సర్ మీరు భయపడుతుంటే.. క్యూట్ గా ఉన్నారని చెబుతుంది కృష్ణ. చిన్నప్పుడు బట్టలు లేకుండా ఉన్న మురారి ఫొటో చూపిస్తుంది. దీంతో అది తీసుకునేందు ట్రై చేస్తాడు మురారి. కృష్ణను హగ్ చేసుకుంటాడు. ఇద్దరు కలిసి బెడ్ మీద పడిపోతారు. దీంతో చిన్నగా రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. కృష్ణ గాలిలో తేలిపోతుంది. ఫొటో లాక్కుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు మురారి.
మురారి తనను హగ్ చేసుకున్న విషయాన్నే తలుచుకుంటుంది కృష్ణ. మరోవైపు భర్తల దినోత్సవం జరిపేందుకు ఇంట్లో ఏర్పాట్లు చేస్తారు. ఆదర్శ్ వచ్చేలోపు ఇంటికి సంబందించిన అన్ని విషయాలు ముకుంద తెలుసుకోవాలని భవానీతో కృష్ణ అంటుంది. ఇంకోవైపు.. నువ్ చెప్పింది నిజమే అనిపిస్తుందని అలేఖ్యతో కృష్ణ విషయం చెబుతుంది ముకుంద.
ఎంక్వైరీ చేస్తున్న కృష్ణ
మురారి కాలేజీ విషయాలు ఎంక్వైరీ చేస్తుంది కృష్ణ. మధుకర్ ను అడుగుతుంది. నీ అంత ప్రేమించే వ్యక్తి భార్యగా రావడం మురారి అదృష్టం అని అనగా.. ఇంత పెద్ద ఇంటికి కోడలిగా రావడం నా అదృష్టమని అంటుంది కృష్ణ.
ముకుంద ప్లాన్ సక్సెస్
ఇక తర్వాతి రోజు భర్తల దినోత్సవం పూజ చేస్తారు. ఇంట్లో భార్యలకు ప్రసాదం ఇస్తుంది రేవతి. దాన్ని భర్తలకు తినిపించాలని అంటుంది. కృష్ణ దగ్గర ఉన్న ప్రసాదం నేలపాలు చేయాలని ముకుంద ప్లాన్ వేస్తుంది. అలేఖ్యను అడుగుతుంది. ఈ సందర్భంగా అలేఖ్య మధుకర్ ను గిచ్చి గొడవ పెట్టుకుంటుంది. అలేఖ్యను పట్టుకునేందుకు మధుకర్ ప్రయత్నించే క్రమంలో కృష్ణ చేతికి తాకి.. ప్రసాదం కింద పడుతుంది. తన దగ్గర ఉన్న ప్రసాదం తీసి.. మురారికి ఇవ్వమని చెబుతుంది ముకుంద.

Related Articles

Latest Articles

You cannot copy content of this page