Saturday, June 29, 2024

Star Maa Serials : టాటా బైబై.. ఆ సీరియల్‍కి శుభం కార్డు.. లైన్‍లో మరో కొత్త సీరియల్

Malli Serial : స్టార్ మా సీరియల్స్ అంటేనే రేటింగ్, వ్యూయర్ షిప్ లో దుమ్మురేపుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవే టాప్ లో ఉంటున్నాయి. ఉదాహరణకు టాప్ 10 సీరియల్స్ తీసుకుంటే.. అందులో కనీసం 5 సీరియల్స్ అయినా స్టార్ మావే ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే నిర్మామ విలువలు మెయింటెన్ చేస్తారు.

అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే.. ఏదైనా సీరియల్ సరిగా టీఆర్పీలు రాకుంటే.. దానికి అక్కడే ఖతమ్ చేసేస్తారు. బడ్జెట్ ఎంత అయింది.. ఇవన్నీ ఏం పట్టించుకోరు. కొన్ని రోజులపాటు సీరియల్ ను పరిశీలిస్తారు. తర్వాత కంటెంట్ జనాలకు వెళ్లడం లేదు అనుకుంటే.. సీరియల్ ను అర్ధాంతరంగా ఆపేస్తారు. తాజాగా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సీరియల్‍కు శుభంకార్డు వేశారు.

కొన్ని రోజుల కిందటే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో ఈ ధారవాహికను తీసుకొచ్చారు. కథను బాగా నమ్మారు. కానీ ఈ సీరియల్ మాత్రం అనుకున్నంత స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదు. నిజానికి గుప్పెడంత మనసు సీరియల్ స్లాట్ ను కూడా దీనికోసం ఛేంజ్ చేశారు.

రాత్రి 7 గంటలకు గుప్పెడంత మనసు సీరియల్ ప్రసారం అయ్యేది.. దానిప్లేసులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ తీసుకొచ్చారు. మెుదట కొన్ని రోజులు సీరియల్ బాగానే నడించింది. తర్వాత మాత్రం టీఆర్పీలు అనుకున్నంత రేంజులో రాలేదు. ఈ కారణంగా మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రసారం చేశారు.

ఆ సమయంలోనూ పెద్దగా ఎవరూ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక ఈ సీరియల్ కు ఎండ్ కార్డ్ వేసేశారు. సెప్టెంబర్ 23 ఎపిసోడ్ లాస్ట్. తర్వాత ఈ సీరియల్ ప్రసారం కాదు. అయితే దీనిని ముగించేందుకు మరో కారణం కూడా ఉంది అంటున్నారు. అదేంటంటే.. ఈ మధ్యనే గుండెనిండా గుడి గంటలు సీరియల్ ప్రకటించారు. దీంతో ఏదో ఒక సీరియల్ కు శుభం కార్డు వేయక తప్పలేదు.

ఎలాగూ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్‍కు టీఆర్పీలు రావడం లేదని శుభం కార్డు వేసేశారు. కొత్త సీరియల్ గుండెనిండా గుడి గంటలు అక్టోబర్ 2 నుంచి మెుదలు కానుంది. ఈ సీరియల్‍ను సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు.

ఈ సమయంలో మల్లీ సీరియల్ వస్తోంది. దీంతో ధారవాహిక టైమింగ్స్ మారుతాయి. మల్లి రేటింగ్స్ విషయంలోనూ స్టార్ మా సంతృప్తిగా లేదని తెలుస్తోంది. దీనిని కూడా మధ్యాహ్నం 12.30కి మార్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ స్టార్ మా మరో సమస్యను ఎదుర్కొంటోంది. జీ తెలుగులో ప్రసారమయ్యే.. ప్రేమ ఎంత మధురం కూడా 9 గంటలకు ప్రసారం చేస్తున్నారు. దీనికి భారీగా వ్యూయర్ షిప్ ఉంది. గుండె నిండా గుడి గంటలు సీరియల్‍కు మెుదటి నుంచే గట్టి పోటీ ఉండనుంది.

Related Articles

Latest Articles

You cannot copy content of this page