Saturday, June 29, 2024

Jyothi Rai : ఓహో జ్యోతి రాయ్ హాట్ షో వెనక అసలు కారణం ఇదేనా..

గుప్పెడంత మనసు సీరియల్ చూసేవారికి రిషి తల్లి జగతి బాగా తెలుసు. ఎంత పద్ధతిగా ఉంటుందో కదా. చూడముచ్చటగా, అందంగా కనిపిస్తుంది. అయితే ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె హాట్ ఫొటోలు కుర్రాళ్ల గుండెలను మెలిపెడుతున్నాయి.

ఇక సీరియల్ ను రెగ్యులర్‍గా ఫాలో అయ్యేవారు మాత్రం.. వామ్మో.. ఈమె మా గుప్పెడంత మనసు సీరియల్‍లో రిషి తల్లి జగతియేనా అని అనుకుంటున్నారు.
నిజానికి ఒకప్పుడు సీరియల్ల్ అంటే.. నటీమణులు చాలా పద్ధతిగా ఉండేవారు. వాళ్లు కట్టుబొట్టు చూసి.. అలా బయటకూడా మెయింటెన్ చేయాలని చాలా మంది అనుకునేవారు. కొని రోజులు మారుతున్నాయి. బుల్లితెరపైకి కొత్త నీరు వస్తుంది. వాళ్లు చాలా అప్డేట్ గా ఉంటున్నారు.

ఓ వైపు సీరియళ్లలో పద్ధతిగా నటిస్తూనే.. సినిమాల్లో అవకాశల కోసం.. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తున్నారు. ఎలాంటి గ్లామర్ షో చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఇలా ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ.. అటు కన్నడ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వైరల్ అయింది జ్యోతి రాయ్. ఆమె ఎవరో కాదు.. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి తల్లి జగతి. అక్కడ చూస్తే మాత్రం.. ఎంత పద్ధతిగా ఉంది కదా అనిపిస్తుంది.

కానీ హాట్ షో చేయడంలో నేనేమీ తక్కువ కాదు అని నిరూపిస్తుంది జ్యోతి. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అయితే ఆమె ఇలా గ్లామర్ షో చేయడానికి కారణాలు ఉన్నాయి.

జ్యోతి రాయ్ కు పెళ్లి అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ ఆమెను చూస్తే.. అలా అనిపించదు. సీరియల్ లో మాత్రం.. రిషికి తల్లి వయసు అన్నట్టుగానే అనిపిస్తుంది. ఆమె మాట తీరు, నటన కూడా అద్భుతంగా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్రతో జగతి సీన్స్ కొన్ని చాలా బాగుంటాయి. అయితే కొన్ని రోజులుగా ఈమె చేసే హాట్ షో మాత్రం బాగా వైరల్ అయింది. ఇదంతా చేసేందుకు ఓ కారణం కూడా ఉంది. ఆమె ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.

ఈ పాత్ర కోసం ఇన్నాళ్లుగా జ్యోతిరాయ్ చాలా కష్టపడిందట. తనలోని గ్లామర్ ను బయటపెట్టి.. కుర్రాళ్లకు మతులు పొగొడుతోంది. కుర్రా హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇటీవలే ప్రెట్టీ గర్ల్ ఫస్ట్ లుక్ ను తన ఇన్ స్టాలో పంచుకుంది జ్యోతిరాయ్. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసిన జనాలు మాత్రం ఫీదా అయిపోతున్నారు. సీరియల్స్ లో పద్ధతిగా కనిపించే.. జ్యోతిరాయ్.. ఇంతం అందంగా ఉంటుందా అని షాక్ అవుతున్నారు.

ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కు కూడా గురి అవుతుంది. భర్తకు ఈ మధ్యనే విడాకులు ఇచ్చేసింది. ఓ యువ దర్శకుడితో జ్యోతిరాయ్ రిలేషన్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె తన ఇంటి పేరును మార్చుకోవడంతో బాగా వైరల్ అయింది. కానీ ఈ విషయంపై మాత్రం ఆమె ఎప్పుడూ స్పందించలేదు. ఆమె ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్‍లో ఇంకెంత హాట్ షో చేస్తోందో చూద్దాం.

Related Articles

Latest Articles

You cannot copy content of this page